Gudivada Amarnath | తగ్గే ప్రసక్తే లేదు..మళ్లీ మళ్లీ అంటా..!ఏమైనా చేస్కోండి | ACTPnews

Gudivada Amarnath  |  తగ్గే ప్రసక్తే లేదు..మళ్లీ మళ్లీ అంటా..!ఏమైనా చేస్కోండి



ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హోంమంత్రి వంగలపూడి అనిత వర్సెస్ వైస్సార్సీపీ నేతల మధ్య వివాదం పీక్ స్టేజ్కు చేరింది. తన వ్యాఖ్యలపై కూటమి నేతలు చేస్తున్న విమర్శలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. “తగ్గే ప్రసక్తే లేదు.. మళ్లీ మళ్లీ అంటా.. ఏపీలోనే కాదు, దేశంలో లేదా అంతర్జాతీయంగా నీకు నచ్చిన చోట కంప్లయింట్ ఇచ్చుకో” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను మహిళలను ఉద్దేశించి మాట్లాడలేదని, కేవలం ఒక వ్యక్తి (అనిత) రాజకీయ వైఖరిని మాత్రమే విమర్శించానని స్పష్టం చేశారు. ఒక ముఖ్యమంత్రిపై అనిత గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన ఆయన.. తన మాటలను రాష్ట్ర మహిళలందరికీ ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర సంప్రదాయాన్ని తాము కాలరాయడం లేదని చెప్తూ గుడివాడ అమర్నాథ్ ఉరుములు ఉరిమిన ప్రెస్ మీట్ పూర్తి వీడియోను ఇక్కడ చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed