Last Updated:
వెండితెరపై తన నటనతో దశాబ్దాల పాటు రాజసం వలికించిన రమ్యకృష్ణ, ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లోకి హోస్ట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ‘జియో హాట్‌స్టార్’ (Jio Hotstar) ఓటీటీ వేదికగా త్వరలో ప్రారంభం కానున్న ఒక ఇంట్రెస్టింగ్ తమిళ్ డేటింగ్ రియాలిటీ షోకు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
టాలీవుడ్ అలనాటి స్టార్ హీరోయిన్, ‘బాహుబలి’ చిత్రంలో మమతల తల్లి శివగామిగా పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టించిన సీనియర్ నటి రమ్యకృష్ణ సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వెండితెరపై తన నటనతో దశాబ్దాల పాటు రాజసం వలికించిన ఆమె, ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లోకి హోస్ట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ‘జియో హాట్‌స్టార్’ (Jio Hotstar) ఓటీటీ వేదికగా త్వరలో ప్రారంభం కానున్న ఒక ఇంట్రెస్టింగ్ తమిళ్ డేటింగ్ రియాలిటీ షోకు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ‘సెకండ్ లవ్’ (Second Love) అనే వైవిధ్యమైన టైటిల్‌తో రాబోతున్న ఈ షోకు సంబంధించిన అధికారిక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘సెకండ్ లవ్’ అనగానే వినడానికి కాస్త వెరైటీగా, నేటి జనరేషన్‌కు కనెక్ట్ అయ్యేలా ఈ షో కాన్సెప్ట్‌ను డిజైన్ చేశారు నిర్వాహకులు. జీవితంలో అప్పటికే బ్రేకప్ (Breakup) అయి ఒంటరిగా ఉంటున్న, 30 ఏళ్ల లోపు వయసు గల 12 మంది సింగిల్స్‌ను (అబ్బాయిలు, అమ్మాయిలు) ఒక విలాసవంతమైన విల్లాలోకి పంపిస్తారు. అక్కడ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కొన్ని రోజుల పాటు వారందరూ కలిసి ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారి మధ్య జరిగే సంభాషణలు, టాస్కులు, గొడవలు, వారి జీవితంలో ‘రెండో ప్రేమ’ (Second Love) చిగురించే ఆసక్తికరమైన సందర్భాల చుట్టూ ఈ రియాలిటీ రొమాన్స్ సిరీస్ సాగనుంది.
తాజాగా విడుదలైన ఈ షో ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రమ్యకృష్ణ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బ్రేకప్ అయిన ఒక హార్ట్ సింబల్‌కు ప్యాచ్ అప్ (కలుపుతూ) చేస్తూ ఆమె ఇచ్చిన పోజ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో రమ్యకృష్ణ 90ల నాటి హీరోయిన్‌లా కాకుండా, నేటి జెన్-జి (Gen-Z) హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చేలా ఎంతో స్టైలిష్‌గా, యంగ్‌గా కనిపించడం విశేషం.
నిజానికి ఇలాంటి డేటింగ్ రియాలిటీ షోలు దక్షిణ భారత దేశానికి కాస్త కొత్తే అయినప్పటికీ, బాలీవుడ్ (ఉత్తరాది) మార్కెట్లో వీటికి భారీ క్రేజ్ ఉంది. హిందీలో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ షోగా దూసుకుపోతున్న ‘ఎంటివి స్ప్లిట్స్‌విల్లా’ (MTV Splitsvilla) తరహాలోనే ఈ ‘సెకండ్ లవ్’ షో ఉండబోతోందని తెలుస్తోంది. అయితే తమిళ జియో హాట్‌స్టార్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో మాత్రమే ప్రస్తుతానికి ఈ ప్రకటన రావడంతో, తెలుగులో కూడా రమ్యకృష్ణ హోస్టింగ్‌తోనే సమాంతరంగా ఈ షోను స్ట్రీమింగ్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. డేటింగ్ కాన్సెప్ట్ కావడంతో ఈ షోపై ప్రశంసలతో పాటు కొన్ని వర్గాల నుండి విమర్శలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.
ఇటీవల కాలంలో అలనాటి స్టార్ నటీనటులు రియాలిటీ షోల ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం ఒక ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే రమ్యకృష్ణ కో-స్టార్స్ అయిన కింగ్ నాగార్జున (బిగ్ బాస్), నందమూరి బాలకృష్ణ (అన్‌స్టాపబుల్), జగపతి బాబు వంటి అగ్ర హీరోలు హోస్ట్‌లుగా టెలివిజన్, ఓటీటీ రంగాలను ఏలుతున్నారు. అలాగే తాజాగా స్ట్రీమింగ్ అయిన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ మరియు వివిధ కుకింగ్ షోల ద్వారా సీనియర్ హీరోయిన్లు లయ, రాధా, ముచ్చర్ల అరుణ వంటి వారు బుల్లితెరపై రీ-ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. మరి అదే బాటలో పయనిస్తున్న రమ్యకృష్ణ, ఈ తమిళ రియాలిటీ రొమాన్స్ సిరీస్‌తో హోస్ట్‌గా ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి!.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













