Last Updated:
స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా మా ఇంటి బంగారం. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలో గ్రాండ్ గా విడుదలై, బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ సాధించింది. ‘కుషి’ (2023) చిత్రం తర్వాత సమంత టాలీవుడ్‌లో ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్‌లో నటించిన సినిమా కావడంతో, దీనిపై ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే తొలిరోజే ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ‘మా ఇంటి బంగారం’ చిత్రం మొదటి రోజు భారతదేశంలో రూ. 5.35 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. పన్నులతో కలుపుకుని దేశవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ సుమారు రూ. 6.20 కోట్లుగా నమోదైంది. కేవలం ఇండియాలోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లోనూ సమంత క్రేజ్ స్పష్టంగా కనిపించింది. విదేశీ మార్కెట్ నుండి తొలిరోజే రూ. 4.50 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడంతో, మొదటి రోజు వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్ ఏకంగా రూ. 10.70 కోట్లకు చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం 2,658 షోలలో ఈ చిత్రం ప్రదర్శితమవ్వడం విశేషం.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (AP/TG) లలో ఈ చిత్రం అత్యధికంగా రూ. 4.75 కోట్ల గ్రాస్‌తో టాప్‌లో నిలిచింది. కర్ణాటకలో రూ. 90 లక్షలు, తమిళనాడులో రూ. 38 లక్షల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. తొలి షోతో పోల్చితే తెలుగు 2D వెర్షన్‌కు రోజంతా ఆక్యుపెన్సీ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఉదయం షోలకు 26.15 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, పాజిటివ్ టాక్ రావడంతో నైట్ షోల సమయానికి అది 51.38 శాతానికి పెరిగింది. మరీ ముఖ్యంగా, ప్రీమియం తెలుగు EPIQ ఫార్మాట్‌లో ఈ చిత్రం ఏకంగా 96 శాతం ఓవరాల్ ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లోని ప్రధాన థియేటర్లలో దాదాపు అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులు పడగా, నైట్ షోలకు నగరంలో 100 శాతం ఆక్యుపెన్సీ రికార్డైంది.
సమంత స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి బి.వి. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఒక సాధారణ గృహిణిగా కనిపిస్తూనే, తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో యాక్షన్ మోడ్‌లోకి వెళ్లే ‘స్వర్ణ’ పాత్రలో సమంత నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుష, శ్రీముఖి కీలక పాత్రల్లో నటించగా, వీకెండ్‌లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













