IND-PAK: పొరపాటున భారత్‌లోకి ప్రవేశించిన పాక్ పౌరుడు.. మానవత్వం చాటుకున్న భారత సైన్యం.. సరిహద్దులో అరుదైన దృశ్యం | | ACTPnews

PC: X.com


Last Updated:

IND-PAK: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దుల్లో సాధారణంగా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అయితే, నియంత్రణ రేఖ (LoC) వద్ద శుక్రవారం ఒక అరుదైన, మానవీయ దృశ్యం చోటుచేసుకుంది.

PC: X.com
PC: X.com

పొరపాటున భారత సరిహద్దుల్లోకి ప్రవేశించిన ఒక పాకిస్తాన్ పౌరుడిని తిరిగి స్వదేశానికి అప్పగించే క్రమంలో, ఇరు దేశాల సైనికాధికారులు ఒకరికొకరు చేతులు కలిపి కరచాలనం (Handshake) చేసుకున్నారు.

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో..

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో ఉన్న చకన్ దా బాగ్ క్రాసింగ్ పాయింట్ వద్ద ఈ ఘటన జరిగింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) పరిధిలోని హాజీపురాకు చెందిన మహ్మద్ రషీద్ అనే వ్యక్తి, ఇటీవల పొరపాటున సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించాడు. భారత సైన్యం అతడిని ఆధీనంలోకి తీసుకుని విచారించగా, అతను ఉద్దేశపూర్వకంగా రాలేదని, పొరపాటునే సరిహద్దులు దాటాడని తేలింది. మానవతా దృక్పథంతో అతడిని తిరిగి పాకిస్తాన్‌కు అప్పగించాలని భారత అధికారులు నిర్ణయించారు.

సైనికాధికారుల కరచాలనం

శుక్రవారం చకన్ దా బాగ్ క్రాసింగ్ పాయింట్ వద్ద మహ్మద్ రషీద్‌ను పాక్ అధికారులకు అప్పగించే ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా భారత సైన్యానికి చెందిన సిబ్బంది, పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ముఖాముఖి కలుసుకున్నారు. సాధారణంగా ఇరు దేశాల మధ్య ఉండే ఉద్రిక్తతలకు భిన్నంగా, అక్కడ అధికారులు నవ్వుతూ పరస్పరం కరచాలనం చేసుకుంటూ కనిపించారు. ఈ అరుదైన స్నేహపూర్వక దృశ్యం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.

తమ దేశ పౌరుడిని క్షేమంగా అప్పగించినందుకు పాక్ అధికారులు భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మహ్మద్ రషీద్‌ను తీసుకొని వారు తిరిగి తమ భూభాగంలోకి వెళ్ళిపోయారు. ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి, మానవత్వాన్ని చాటిచెప్పే విధంగా ఈ పరిణామం నిలిచింది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports