పిల్లల కోసం స్నేహితులుగా.. సామాజిక పోరాటాలు: విడాకులు తీసుకున్నప్పటికీ, పిల్లల భవిష్యత్తు, బాధ్యతల విషయంలో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఇప్పటికీ మంచి స్నేహితుల్లాగే ఉన్నారు. అకీరా, ఆద్యల చదువు, ఇతర కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. కేవలం పిల్లల పెంపకానికే పరిమితం కాకుండా, రేణు దేశాయ్ సామాజిక మాధ్యమాలలో ఎంతో యాక్టివ్గా ఉంటూ సమాజంలో జరిగే పలు పరిణామాలపై గళం విప్పుతున్నారు. వీధి కుక్కల సంరక్షణ, జంతు హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.













