Ram Charan: పవన్ కళ్యాణ్ బాటలో రామ్ చరణ్?.. ఎట్టకేలకు అసలు నిజం బయటపెట్టిన మెగా పవర్ స్టార్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన పొలిటికల్ ఎంట్రీ గురించిన ఊహాగానాలకు తాజాగా తెరదించారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఉద్దేశం తనకు అస్సలు లేదని చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు.

News18
News18

టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన పొలిటికల్ ఎంట్రీ గురించిన ఊహాగానాలకు తాజాగా తెరదించారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఉద్దేశం తనకు అస్సలు లేదని చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. తన దృష్టంతా కేవలం వెండితెరపైనే ఉందని, యాక్టింగ్ ఫీల్డ్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే తన జీవిత ఆశయమని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.

పెద్ది సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన స్పెషల్ ఇంటర్వ్యూలో ‘మెగా అభిమానులు మిమ్మల్ని భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చూడాలని బలంగా కోరుకుంటున్నారు. మీ పొలిటికల్ ప్లాన్స్ ఏంటి? ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారు?’ అని అడిగిన ప్రశ్నకు చరణ్ ఎంతో ఓపెన్‌గా బదులిచ్చాడు.

రామ్ చరణ్ తన మనసులోని మాటను బయటపెడుతూ… ఒకే సమయంలో రెండు వేర్వేరు రంగాల్లో రాణించడం చాలా కష్టమైన విషయమని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ రెండు పడవలపై ప్రయాణం చేయలేనని, అది ఏ ఒక్క రంగానికి కూడా న్యాయం చేయలేనట్లు అవుతుందని చెప్పారు. సినిమా అయినా, రాజకీయం అయినా పూర్తిస్థాయి సమయాన్ని, ఏకాగ్రతను కోరుకుంటాయని చరణ్ వివరించారు. ఏదో ఒక దాన్ని మాత్రమే ఎంచుకుని దానిలోనే అత్యుత్తమంగా నిలవడం తన నైజమని స్పష్టం చేశారు.

గతంలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో పని చేశారని, ప్రస్తుతం తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ప్రజాసేవ చేస్తున్నారని చరణ్ గుర్తు చేశారు. వారిద్దరిని తాను ఎంతో గౌరవిస్తానని, కానీ తన పంథా, తన ఆలోచనలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాయని వెల్లడించారు. తనకు లభించిన నటన అనే అద్భుతమైన వేదిక ద్వారానే ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి ఇష్టపడతానని చెప్పారు.

ప్రస్తుతం గ్లోబల్ వైడ్‌గా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ లైనప్ చూస్తే ఆయన కేవలం సినిమాలపైనే ఎంతటి ఫోకస్ పెట్టారో స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఆయన నటించిన పెద్ది సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్‌లు గట్రా సాలిడ్ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమా జూన్ 4న రిలీజ్ కాబోతుంది. ‘పెద్ది’ తర్వాత చరణ్ తన కెరీర్‌లో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన సినిమా ఇచ్చిన ‘రంగస్థలం’ దర్శకుడు సుకుమార్‌తో మరో భారీ ప్రాజెక్ట్ (RC17) ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి.

రాజకీయాల వైపు అడుగులు వేసే ఆలోచనే లేదని ఆయన స్వయంగా ప్రకటించడంతో మెగా అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తమ హీరో వెండితెరపైనే మరిన్ని వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ గ్లోబల్ లెవెల్లో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని వాళ్లు కోరుకుంటున్నారు. చరణ్ ఇచ్చిన ఈ తాజా స్టేట్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా సినిమా సర్కిల్స్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed