Vaibhav Sooryavanshi: నేడే వండర్ కిడ్ వైభవ్ అరంగేట్రం.. తొలి మ్యాచ్‌తోనే సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్! | క్రీడా వార్తలు | ACTPnews

సచిన్ టెండూల్కర్, వైభవ్ సూర్యవంశీ


Last Updated:

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ చరిత్రలో జూన్ 26, 2026 ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది.

సచిన్ టెండూల్కర్, వైభవ్ సూర్యవంశీ
సచిన్ టెండూల్కర్, వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ చరిత్రలో జూన్ 26, 2026 ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్‌లో జరిగే మొదటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 15 ఏళ్ల ఎడమచేతి వాటం ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సీనియర్ జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయబోతున్నాడు. నేటి మ్యాచ్‌లో వైభవ్ మైదానంలోకి అడుగుపెడితే.. కేవలం 15 ఏళ్ల 91 రోజుల వయసులోనే భారత క్యాప్‌ను అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కుతాడు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 1989లో పాకిస్తాన్‌పై తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. గత 36 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న సచిన్ రికార్డును వైభవ్ నేడు అధిగమించబోతున్నాడు.

ఐపీఎల్ 2026తో మారిన రాత.. ఐర్లాండ్‌లో సూర్యవంశీ మేనియా!

వైభవ్ సూర్యవంశీ ప్రతిభ ప్రపంచానికి పూర్తిస్థాయిలో తెలిసింది ఐపీఎల్ 2026 సీజన్‌తోనే. రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున బరిలోకి దిగిన ఈ యువ ఓపెనర్, సీజన్ మొత్తంలో 776 పరుగులు సాధించి ‘ఆరెంజ్ క్యాప్’ గెలవడమే కాకుండా ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ (MVP) అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒకే సీజన్ సిక్సర్ల (59) రికార్డును ఏకంగా 72 సిక్సర్లతో బద్దలు కొట్టాడు.

ఈ అద్భుత ప్రదర్శన కారణంగానే అతనికి సీనియర్ టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. బిసిసిఐ (BCCI) వైభవ్‌కు సీనియర్ టీమ్ బ్లూ జెర్సీని అందజేస్తున్న వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. జెర్సీ నంబర్ 3 (గతంలో హర్భజన్, సురేష్ రైనా ధరించిన నంబర్) తో వైభవ్ బరిలోకి దిగనున్నాడు. ఐర్లాండ్‌లో ఈ 15 ఏళ్ల కుర్రాడిని చూసేందుకు యూరప్ నలుమూలల (పారిస్ వంటి నగరాల) నుండి అభిమానులు తరలివస్తుండటంతో టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

గ్యారీ సోబర్స్‌తో పోలిక.. రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు, హెచ్చరిక

మాజీ భారత క్రికెటర్ ఎం.వి. నరసింహారావు వైభవ్ బ్యాటింగ్ శైలిని విండీస్ లెజెండ్ సర్ గ్యారీ సోబర్స్‌తో పోల్చారు. వైభవ్ బ్యాట్ స్వింగ్, బ్యాక్ లిఫ్ట్ మరియు బంతి వేగాన్ని త్వరగా అంచనా వేసే విధానం అచ్చం సోబర్స్‌లానే ఉంటుందని ప్రశంసించారు. అయితే అంతర్జాతీయ కెరీర్ ప్రారంభమవుతున్న వేళ సచిన్ లాగే తల వంచుకుని, ఒదిగి ఉండాలని సూచించారు.

మరోవైపు టీమిండియా మాజీ హెడ్ కోచ్, రాజస్థాన్ రాయల్స్ మెంటర్ రాహుల్ ద్రవిడ్ సైతం వైభవ్ ప్రతిభపై స్పందించారు.

“వైభవ్ సూర్యవంశీ ఒక అసాధారణమైన దైవదత్తమైన ప్రతిభ (Gifted Talent). బౌలర్ వేగాన్ని రీడ్ చేయడం, నిర్భయంగా ఆడటం అతని ప్రత్యేకత. 14 ఏళ్ల వయసులోనే అతను నెట్స్‌లో గంటల తరబడి శ్రమించడం నేను చూశాను. అయితే అతనిలాంటి ఒక అద్భుతమైన ఆటగాడిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి (Protect). అతనిపై ఒత్తిడి పడకుండా చూస్తూనే, స్వేచ్ఛగా ఎదిగేందుకు సహకరించాలి” అని ద్రవిడ్ వ్యాఖ్యానించారు.

ఇటీవలే ఇండియా-ఎ తరఫున శ్రీలంక-ఎ పై కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది లిస్ట్-ఏ క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన వైభవ్, నేడు ఐర్లాండ్ బౌలర్లపై ఎలాంటి విద్వంసం సృష్టిస్తాడో చూడాలని ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports