Tatvam Movie: టెర్రిఫిక్‌గా ‘తత్వం’ మూవీ ట్రైలర్.. మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్‌తో..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే ఆ సినిమా చిన్నదైనా పెద్ద విజయాన్ని అందిస్తారు. ముఖ్యంగా మర్డర్‌ మిస్టరీ జానర్‌ సినిమాల్లో ఉండే ఉత్కంఠ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది.

News18
News18

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే ఆ సినిమా చిన్నదైనా పెద్ద విజయాన్ని అందిస్తారు. ముఖ్యంగా మర్డర్‌ మిస్టరీ జానర్‌ సినిమాల్లో ఉండే ఉత్కంఠ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఇదే కోవలో ఓ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ల్‌ కలిగించే అంశాలతో రాబోతున్న చిత్రం ‘తత్వం’. దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్‌ కోల దర్శకుడు. త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్బంగా ఎడిటర్‌ విప్లవ్‌ నైషదం మాట్లాడుతూ ” ఈ సినిమా జర్నీ ఎంతో స్పెషల్‌.. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు. అర్జున్‌ సాఫ్టవేర్‌రంగం నుంచి వచ్చి ఎంతో ఇష్టంతో ఈ సినిమాకు దర్శకత్వం చేశాడు. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా ఈ చిత్రాన్ని డీల్‌ చేశాడు,. ఆద్యంత ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు నాకు సంతోషంగా ఉంది’ అన్నారు. సంగీత దర్శకుడు చేతన్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ ” ఈ రోజుల్లో చిన్న సినిమాల ద్వారా మంచి కంటెంట్‌ను ఇస్తున్నారు. ఆడియన్స్‌ కూడా ఆదరిస్తున్నారు. ఇది కూడా ఆ కోవలోకి వచ్చే చిత్రమే. ఈ సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుంది. మంచి ఎమోషనల్‌ కనెక్టవిటి ఉన్న థ్రిల్లర్. సంగీతానికి స్కోప్‌ ఉన్న చిత్రమిది. అర్జున్‌ ఎంతో ప్రతిభ ఉన్న దర్శకుడు’ అన్నారు.

ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత భరత్‌ మాట్లాడుతూ ” ట్రైలర్‌ అందరికి నచ్చింది. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్‌ కుదిరాయి. అందరూ ఈ సినిమా కోసం ఎంతో సపొర్ట్‌ చేశారు. అర్జున్‌ కోలా ఈ రోజు కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు. అనుకున్న కథను మించి దర్శకుడు తెరకెక్కించాడు. ఖర్చుకు రాజీపడకుండా నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. అందరికి మంచి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా’ అన్నారు.

నిర్మాత వంశీ సీమకుర్తి మాట్లాడుతూ ” ట్రైలర్‌ అందరికి నచ్చింది. సినిమా కూడా చాలా బాగుంటుంది. దర్శకుడు అనుకున్నది అనుకున్నట్లుగా స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేశాడు. ఈసినిమా మంచి అవుట్‌ పుట్‌ రావడానికి అందరూ సహకరించారు. అందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

మరో నిర్మాత శ్వేత పసుపులేటి మాట్లాడుతూ ” తత్వం టైటిల్‌కు తగ్గట్టుగా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఓ కొత్త సినిమాను చూశామన్నఅనుభూతికి లోనవుతారు. దర్శకుడు ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం విజయం రూపంలో వస్తుందని నమ్ముతున్నాను’ అన్నారు.

దర్శకుడు అర్జున్‌ కోలా మాట్లాడుతూ ” ఈ మూవీ టైటిల్‌, కాన్సెప్ట్‌ను మన చుట్టు జరుగుతున్న ఇన్‌సిడెంట్స్‌ ఆధారంగా తయారుచేసుకున్నాను. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌ ఇది. దినేష్‌ తేజ్‌ వినగానే వెంటనే ఓకే చేశాడు. ఈ సినిమా కోసం అందరూ దిబెస్ట్‌ ఇచ్చారు. కథ తప్పకుండా అందర్ని ఎంగేజింగ్‌గా ఉంటుంది. వంశీ గారి అన్వేషణ తరహాలోనే అందర్ని కట్టిపడేసే సినిమా ఇది. ఈ సినిమాలో ఉంటే ట్విస్ట్‌ ఆడియన్స్‌కు షాకింగ్‌గా ఉంటుంది’అన్నారు.

హీరో దినేష్‌ తేజ్‌ మాట్లాడుతూ ”నేను కలిసి పనిచేయాలనుకున్న టెక్నిషియన్స్‌తో ఈ సినిమాలో వర్క్‌ చేశాను. ఈసినిమాతో చాలా మంది కొత్తవాళ్లు పరిచయం అవుతున్నారు. అందరం చాలా కష్టపడ్డాం. అది సినిమా చూసిన తరువాత అందరికి తెలుస్తుంది. ఇక మీద నా సినిమాలకు గ్యాప్‌ రాదు. ఈ తత్వం తరువాత నేను సినిమాలతో బిజీ అవుతున్నాను. నా కెరీర్‌కు ఇది టర్నింగ్‌ పాయింట్‌గా నిలుస్తుంది. అందరి సహకారంతో భవిష్యత్‌లో మరిన్ని మంచి సినిమాలు చేస్తాను. కంటెంట్‌ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు. సో.. అలాంటి బలమైన కంటెంట్‌తో రాబోతున్న తత్వంను ప్రేక్షకులు సక్సెస్‌ చేస్తారని నమ్ముతున్నాను అన్నారు.

.ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: భరత్‌ రోంగలి, ఎడిటర్‌: విప్లవ్‌ నైషదం,కెమెరా: భరత్‌ పట్టి, డిఐ: భూషణ్‌, దర్శకుడు: అర్జున్‌ కోల, నిర్మాత: వంశీ సీమకుర్తి.,శ్వేత పసుపులేటీ

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports