వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన సమావేశంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించక చదువుకు దూరం చేస్తున్నారని అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని, కొత్త పథకాలు తీసుకురాలేదని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డ్రగ్స్‌పై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్ వ్యవహారాల్లో ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. యువతను మాదకద్రవ్యాల బారి నుంచి రక్షించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఏపీఏఐఎంఎస్ 2.0 పోర్టల్ ద్వారా ఎరువుల పంపిణీని పూర్తిగా పారదర్శకంగా మార్చి బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట వేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పటివరకు 2.97 లక్షల మంది రైతులకు అవసరమైన ఎరువులు నేరుగా అందించామని చెప్పారు. ఎరువుల సరఫరాపై రియల్ టైమ్ పర్యవేక్షణ జరుగుతోందని, సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ 155251కు ఫిర్యాదు చేయాలని సూచించారు. టమాటా ధరలు పడిపోయాయన్న, జైన్ మ్యాంగో పల్ప్ యూనిట్ మూతపడిందన్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు.
తాడిపత్రిలో గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్ష చేపడతామని కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గం ప్రకటించగా, దానిని అడ్డుకుంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం స్పష్టం చేసింది. ఇదే సమయంలో అనంతపురంలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపడతామని టీడీపీ నేతలు ప్రకటించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఇరు వర్గాల కార్యక్రమాలకు అనుమతి నిరాకరించి, కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహనిర్బంధం చేశారు. తాడిపత్రిలోని సున్నిత ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇరుపక్షాల నేతలకు ముందస్తు లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చెన్నైలో నిర్వహించిన మారథాన్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ 6 కిలోమీటర్లు పరుగెత్తారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ప్రతిరోజూ వ్యాయామం చేయాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వ చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కోసం మారథాన్‌లు, మినీ మారథాన్‌లు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
పాస్‌పోర్టు పౌరసత్వానికి ఆధారం కాదన్న కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలపై శశి థరూర్ స్పందించారు. పాస్‌పోర్టు, ఆధార్‌లను పౌరసత్వ గుర్తింపుగా పరిగణించేలా చట్ట సవరణలు చేయాలని కోరారు. భారతీయులు కానివారికి ఇచ్చే ఆధార్ కార్డులపై ప్రత్యేక గుర్తింపు ఉండాలని సూచించారు. పాస్‌పోర్టు కూడా పౌరసత్వాన్ని నిర్ధారించకపోతే భారతీయ పౌరసత్వానికి ఆధారం ఏమిటని కేంద్రాన్ని ప్రశ్నించారు.
భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై మరోసారి విమర్శలు చేసింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత హోదాను ‘లీడర్ ఆఫ్ పర్యాటన్’గా మార్చుకోవాలని ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో వ్యంగ్య పోస్టులు షేర్ చేసింది. కాంగ్రెస్ పార్టీ బదులుగా రాహుల్ గాంధీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, పలు దేశాలు ఆహ్వానిస్తున్నాయని, ఆయన అంతర్జాతీయ గుర్తింపు పొందిన నాయకుడని, ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలను ప్రశ్నించనప్పుడు రాహుల్ పర్యటనలపై విమర్శలు ఎందుకని కాంగ్రెస్ నిలదీసింది.
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ డాక్యుమెంటరీలో రానా దగ్గుబాటి వ్యాఖ్యలకు స్పందిస్తూ ప్రభాస్ మూడు వేళ్లు చూపించగా, అనుష్క శెట్టి చిరునవ్వు చిందించారు. చివర్లో కనిపించిన ‘అండ్ ది లెగసీ కంటిన్యూస్’ సందేశంతో ‘బాహుబలి 3’పై. అయితే దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి లేదా చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ‘బాహుబలి 3’పై ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘ఆల్ఫా’ సినిమా యాక్షన్ సన్నివేశాల ప్రాక్టీస్ సమయంలో అనుకోకుండా ఓ కొరియోగ్రాఫర్‌ను కొట్టానని ఆలియా భట్ తెలిపారు. ఆ ఘటన ఇప్పటికీ బాధ కలిగిస్తుందని చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవమని పేర్కొన్నారు. బాబీ దేవోల్ కూడా అలియాతో యాక్షన్ సన్నివేశాలు చేస్తూ ఆమెకు దెబ్బ తగలకూడదనే జాగ్రత్తతో నటించినట్లు వెల్లడించారు.
వెనెజువెలా భూకంప బాధితులకు సాయం చేసేందుకు భారత్ ‘ఆపరేషన్ అమిస్తాద్’ను ప్రారంభించింది. భారత వైమానిక దళం సీ-17 విమానాల ద్వారా వైద్య బృందం, భీష్మ క్యూబ్‌లు, మందులు, సహాయ సామగ్రిని పంపింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెనెజువెలాకు భారత్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ భూకంపాల్లో ఇప్పటివరకు 235 మంది మరణించగా, 1,500 మందికిపైగా గాయపడ్డారు.












