Last Updated:
టాలీవుడ్ హిలేరియస్ కమెడియన్ సత్య పూర్తిస్థాయి కథానాయకుడిగా మారిన సినిమా ‘జెట్ లీ’. ‘మత్తు వదలరా’ లాంటి విలక్షణమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రితేష్ రానా ఈ క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు.
టాలీవుడ్ హిలేరియస్ కమెడియన్ సత్య పూర్తిస్థాయి కథానాయకుడిగా మారిన సినిమా ‘జెట్ లీ’. ‘మత్తు వదలరా’ లాంటి విలక్షణమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రితేష్ రానా ఈ క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు. భిన్నమైన ప్రమోషన్లతో విడుదల ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్‌లలో పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు.
థియేటర్ రన్ పూర్తికావడంతో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయింది. ‘జెట్ లీ’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జియో హాట్ స్టార్’ కైవసం చేసుకుంది. మే 25 తేదీ నుంచి ఈ సినిమా డిజిటల్ లవర్స్‌కు అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.
సుమారు 15 వేల కోట్ల రూపాయల భారీ స్కామ్ చేసి దేశం దాటి పారిపోయిన అజయ్ అనే వ్యక్తిని స్పెషల్ ఆఫీసర్ రియా చాకచక్యంగా పట్టుకుంటుంది. అతడిని తిరిగి ఇండియాకు తీసుకురావడానికి ఒక ఫ్లైట్ లో ప్రయాణం మొదలవుతుంది. సరిగ్గా అదే సమయంలో తన గతం మర్చిపోయిన జెట్ లీ (సత్య) ఆ ఫ్లైట్ లోకి ప్రవేశిస్తాడు. మెమరీ లాస్ తో బాధపడే జెట్ లీ అక్కడ సృష్టించిన గందరగోళం ఏంటి? ఆ 15 వేల కోట్ల డబ్బు చివరకు ఏమైంది? ఈ ప్రయాణంలో ఎదురైన చిత్ర విచిత్ర సంఘటనలు ఏంటి? అన్నదే ఈ సినిమా అసలు కథ.
దర్శకుడు రితేష్ రానా సినిమాల్లో ఒక రకమైన క్రేజీ, సర్రియల్ కామెడీ కనిపిస్తుంది. ‘మత్తు వదలరా’ రెండు భాగాల్లో అది బాగా వర్కవుట్ అయింది. కానీ ఈ సినిమా విషయానికి వస్తే దర్శకుడు అనుకున్న కామెడీని తెరపైకి తీసుకురావడంలో కొంత తడబడ్డారు. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా కేవలం హాస్యాన్నే నమ్ముకున్నాడు. అయితే కథలో బలం లేకపోవడం వల్ల ఆ నవ్వులు కూడా కొన్ని చోట్ల పేలలేదు. పాత్రల ప్రవర్తన వెనుక సరైన కారణాలు లేకపోవడం ప్రేక్షకుడిని అయోమయానికి గురి చేస్తుంది.
సత్య తన అద్భుతమైన టైమింగ్‌తో సినిమాను భుజాన వేసుకుని నడిపించారు. తన గతం మర్చిపోయి తనతో తానే మాట్లాడుకునే సన్నివేశాల్లో సత్య నటన అద్భుతం. అలాగే వెన్నెల కిషోర్ తో కలిసి ఆయన చేసే రచ్చ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. మొదటి భాగం వరకు కథనం వేగంగానే సాగినట్లు అనిపిస్తుంది. కానీ రెండో భాగం వచ్చేసరికి సీన్లు సాగదీసినట్లు ఉండటంతో ప్రేక్షకులకు సహన పరీక్ష ఎదురవుతుంది. ఎడిటింగ్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తుంది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













