IND W vs AUS W : టి20 ప్రపంచకప్‌లో ముగిసిన టీమిండియా కథ.. ఆసీస్ చేతిలో ఓటమితో టోర్నీ నుంచి అవుట్ | క్రీడా వార్తలు | ACTPnews

PC: ICC


Last Updated:

యాష్ గార్డ్‌నర్ (29 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుతో మ్యాచ్ గతినే మార్చేసింది. వెటరన్ ప్లేయర్ అలీసా పెర్రీ (38 బంతుల్లో 56 నాటౌట్; 8 ఫోర్లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఓటమితో భారత్ ఇంటిదారి పట్టగా.. ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికా సెమీస్ చేరింది. గ్రూప్ ‘బి’ నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు సెమీస్ చేరాయి.

PC: ICC
PC: ICC

IND W vs AUS W : మహిళల టి20 ప్రపంచకప్ 2026 (Women’s T20 World Cup 2026)లో టీమిండియా ప్రస్థానం ముగిసింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన పోరులో భారత జట్టు పేలవ బౌలింగ్, ఫీల్డింగ్‌తో ఓటమిని ఖాయం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు చిత్తు చిత్తుగా ఓడింది. 171 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మరో 6 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం 19 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. యాష్ గార్డ్‌నర్ (29 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుతో మ్యాచ్ గతినే మార్చేసింది. వెటరన్ ప్లేయర్ అలీసా పెర్రీ (38 బంతుల్లో 56 నాటౌట్; 8 ఫోర్లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఓటమితో భారత్ ఇంటిదారి పట్టగా.. ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికా సెమీస్ చేరింది. గ్రూప్ ‘బి’ నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు సెమీస్ చేరాయి.

ఆరంభంలో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఒక దశలో టీమిండియా మ్యాచ్‌పై పూర్తిగా పట్టు సాధించింది. అయితే యాష్ గార్డ్‌నెర్ క్రీజులోకి వచ్చాక మ్యాచ్ స్వరూపం మారిపోయింది. వచ్చీ రావడంతోనే హిట్టింగ్‌కు దిగింది. మరో ఎండ్‌లో ఉన్న పెర్రీ కూడా ధాటిగా ఆడటం మొదలు పెట్టింది. అదే సమయంలో భారత బౌలర్లు నో బాల్స్ వేశారు. ఫీల్డర్లు మిస్ ఫీల్డ్ చేశారు. ఫలితంగా ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 56; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోయింది. స్మృతి మంధాన (38), షఫాలీ వర్మ (34), జెమీమా రోడ్రిగ్స్ (34) ఫర్వాలేదనిపించారు. అయితే హర్మన్ చివరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో హోరెత్తించింది. ఫలితంగా భారత్ భారీ స్కోరును అందుకుంది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports