YouTube home birth death: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లోనే ప్రసవం.. కోడలు మృతి | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

YouTube home birth death: ఈ సంఘటన గర్భిణుల ఆరోగ్య సంరక్షణలో అవగాహనా లోపాన్ని హైలెట్ చేస్తోంది. ఇలాంటి విషయాల్లో సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వచ్చే వీడియోలను ఫాలో అవ్వడం ఎంత ప్రమాదకరమో ఇది బయటపెడుతోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తమిళనాడు తిరుప్పూర్ జిల్లాలో యూట్యూబ్ వీడియోల సాయంతో ఇంట్లోనే ప్రసవం చేయడానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్త కారణంగా.. కోడలు చనిపోయింది. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చగా మారింది. ప్రభుత్వ అధికారుల తీరు, గర్భిణుల రక్షణపై చర్చను లేవనెత్తింది. ది హిందూ రిపోర్టు ప్రకారం.. 32 ఏళ్ల శశికళకు జూన్ 24 తెల్లవారుజామున పురిటి నొప్పులు వచ్చాయి. కానీ అత్త ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. ఇంట్లోనే డెలివరీ చేయడం వల్ల తీవ్ర రక్తస్రావంతో జూన్ 28 ఉదయం కోడలు మరణించింది.

ఉత్తుకులి తాలూకా పుంజైతళవాయిపాళ్యం గ్రామానికి చెందిన శశికళ, ఆమె భర్త 35 ఏళ్ల కొలందైసామి ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. వారికి ఆరేళ్ల కూతురు ఉంది. ఆమె ఇదివరకు సి-సెక్షన్ ద్వారా పుట్టింది. రెండో గర్భం సమయంలో ఆమెను అసలు ఆసుపత్రికే తీసుకెళ్లలేదు. టీకాలు ఇవ్వలేదు. ఏ పరీక్షలూ చేయించలేదు. జూన్ 24న పురిటి నొప్పులు రాగా, భర్త. అత్త పళనియమ్మాల్ కలిసి.. యూట్యూబ్‌లో నేచురల్ బర్త్ వీడియోలు చూస్తూ ఇంట్లోనే ప్రసవం చేయించడానికి రెడీ అయ్యారు. శిశువు సురక్షితంగానే పుట్టినా.. ప్లాసెంటా సక్రమంగా బయటకు రాకపోవడంతో తీవ్ర రక్తస్రావం మొదలైంది.

ఇవి కూడా చదవండి: Viral Video: నాకు బతకాలని ఉంది.. హనీమూన్‌కి భార్యతోపాటూ.. బాడీగార్డులను తీసుకెళ్లిన భర్త!

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఆమెను మొదట స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులకూ, తర్వాత ఈరోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆమె గర్భసంచిని తొలగించారు. ఆరోగ్యం క్షీణించడంతో జూన్ 25న కోయంబత్తూర్ ప్రైవేట్ ఆసుపత్రికి మార్చారు. మూడు రోజుల చికిత్స తర్వాత ఆదివారం ఉదయం ఆమె మృతిచెందింది. శిశువు డాక్టర్ల పర్యవేక్షణలో సురక్షితంగా ఉంది. ఆరోగ్య శాఖ అధికారులు PICMEలో ఆమె పేరు నమోదై లేదని తెలిపారు.

ఈ సంఘటన గర్భిణుల ఆరోగ్య సంరక్షణలో అవగాహనా లోపాన్ని హైలెట్ చేస్తోంది. ఇలాంటి విషయాల్లో సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వచ్చే వీడియోలను ఫాలో అవ్వడం ఎంత ప్రమాదకరమో ఇది బయటపెడుతోంది. ఉత్తుకుని పోలీసులు.. బ్లాక్ మెడికల్ ఆఫీసర్ కంప్లైంట్‌తో భర్తపై బీఎన్‌ఎస్ సెక్షన్ 105 (హత్యగా పరిగణించని నేరపూరిత నరహత్య) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో కుటుంబం కంప్లైంట్ చేయలేదు. వారు నేచురల్ డెలివరీని ఎంచుకున్నట్లు చెప్పారు. పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

ఇవి కూడా చదవండి: El Nino Weather: కురవని మేఘాలు. పడని వాన. ముంచేసిన రాకాసి ఎల్ నినో. జులై సంగతేంటి?

ఇది తమిళనాడులో మొదటి సారి కాదు. గతంలో కృష్ణగిరి, తిరుప్పూర్‌లో ఇలాంటి యూట్యూబ్-ప్రేరిత హోమ్ డెలివరీల్లో మరణాలు సంభవించాయి. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నట్లు, ముఖ్యంగా మునుపటి సి-సెక్షన్ ఉన్న మహిళలకు ఇంట్లో ప్రసవం అత్యంత ప్రమాదకరం. ప్లాసెంటల్ రిటెన్షన్, హెమరేజ్ వంటి సమస్యల్ని త్వరగా గుర్తించకపోతే ప్రాణాలు కోల్పోవడం సాధారణం. భారతదేశంలో మాటర్నల్ మోర్టాలిటీ రేటును తగ్గించడానికి ప్రభుత్వ ఆసుపత్రులు ప్రయత్నిస్తున్నా.. అనేక గ్రామీణ ప్రాంతాల్లో అవగాహనా లోపం, యూట్యూబ్ వంటి అప్రమాణిక సోర్సులపై ఆధారపడటం పెరుగుతోంది.

ఈ ఘటనపై ఆరోగ్య శాఖ దర్యాప్తు చేపట్టింది. సోషల్ మీడియాలో వైద్య సలహాలు ఇచ్చే వీడియోలు ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మళ్లీ రుజువు చేసింది. కుటుంబాలు డాక్టర్ల సలహా తీసుకోవాలని, ఇంట్లో ప్రసవాలను నివారించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. శశికళ మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై, గర్భిణీ సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *