FIFA World Cup 2026: నాలుగు సార్లు ఛాంపియన్ జర్మనీకి పెనాల్టీ షాక్.. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పెను సంచలనం | క్రీడా వార్తలు | ACTPnews

PC: X.com


Last Updated:

నిర్ణీత 120 నిమిషాల (అదనపు సమయం కలుపుకుని) ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించాల్సి వచ్చింది.

PC: X.com
PC: X.com

FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ దశలో సంచలనం నమోదైంది. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బలమైన జర్మనీ జట్టుకు పరాగ్వే షాకిచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన రౌండాఫ్ 32 పోరులో పెనాల్టీ షూటౌట్ ద్వారా 4-3 తేడాతో పరాగ్వే విజయం సాధించి, జర్మనీని టోర్నీ నుంచి వెళ్లగొట్టింది. నిర్ణీత 120 నిమిషాల (అదనపు సమయం కలుపుకుని) ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించాల్సి వచ్చింది.

పరాగ్వే తరఫున జోస్ కానాలే నిర్ణయాత్మకమైన చివరి పెనాల్టీని గోల్‌గా మలిచి తన జట్టుకు మరువలేని విజయాన్ని అందించాడు. ఈ విజయంతో పరాగ్వే ప్రిక్వార్టర్స్‌కు (రాండ్ ఆఫ్ 16) దూసుకెళ్లగా, తదుపరి మ్యాచ్‌లో ఫ్రాన్స్ లేదా స్వీడన్‌తో తలపడనుంది.

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్

ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలోనే ఇదొక అతిపెద్ద సంచలన విజయంగా నమోదైంది. 2010లో క్వార్టర్ ఫైనల్ చేరిన తర్వాత పరాగ్వే జట్టు మళ్లీ ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేదు. అలాంటి జట్టు ఈసారి ఏకంగా జర్మనీని ఓడించి సత్తా చాటింది.

మ్యాచ్ ప్రారంభంలో జర్మనీ జట్టు పూర్తి ఆధిపత్యం కనబరిచింది. బంతిని ఎక్కువ శాతం తమ ఆధీనంలోనే ఉంచుకుని పరాగ్వే గోల్ పోస్ట్‌పై ఒత్తిడి పెంచింది. మొదటి అర్ధభాగంలో జర్మనీ ఏకంగా 244 పాస్‌లు పూర్తి చేయగా, పరాగ్వే కేవలం 31 పాస్‌లు మాత్రమే చేయగలిగింది. అయినప్పటికీ, పరాగ్వే డిఫెండర్లు జర్మనీ దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నారు.

పరాగ్వే తొలి గోల్.. హావర్ట్జ్ కౌంటర్

మ్యాచ్ 35వ నిమిషంలో జర్మనీ అభిమానులకు షాకిస్తూ పరాగ్వే అద్భుతమైన గోల్ చేసింది. కుడి వైపు నుంచి వచ్చిన వేగవంతమైన కదలికను అందుకుని ఎన్సిసో పవర్‌ఫుల్ హెడర్‌ ద్వారా గోల్ చేసి పరాగ్వేకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. వరల్డ్ కప్ నాకౌట్ చరిత్రలో పరాగ్వేకు ఇదే తొలి గోల్ కావడం విశేషం.

ఆ తర్వాత పుంజుకున్న జర్మనీ.. రెండో అర్ధభాగం ప్రారంభమైన 9 నిమిషాలకే సమాధానం ఇచ్చింది. ఫ్లోరియన్ విర్ట్జ్ అందించిన క్రాస్‌ను కై హావర్ట్జ్ హెడర్ ద్వారా గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు.

రాణించిన కీపర్.. నిరాశపరిచిన VAR

మ్యాచ్ 102వ నిమిషంలో (ఎక్స్‌ట్రా టైమ్) జర్మనీ డిఫెండర్ జోనాథన్ తా హెడర్ ద్వారా గోల్ చేసి జట్టును గెలిపించినంత పని చేశాడు. కానీ, సుదీర్ఘ వీఏఆర్ (VAR) సమీక్ష తర్వాత కీపర్‌పై ఫౌల్ జరిగినట్లు తేలడంతో ఆ గోల్‌ను అంపైర్లు తిరస్కరించారు.

పెనాల్టీ షూటౌట్ ట్విస్ట్

చివరికి మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీయగా, జర్మనీ ఆటగాళ్లు హావర్ట్జ్, నిక్ వోల్టెమేడ్, జోనాథన్ తా పెనాల్టీలను గోల్ చేయడంలో విఫలమయ్యారు. పరాగ్వే తరఫున ఇద్దరు ఆటగాళ్లు మిస్ చేసినప్పటికీ, జోస్ కానాలే ఒత్తిడిని అధిగమించి బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి పరాగ్వేకు చారిత్రాత్మక విజయాన్ని ఖరారు చేశాడు. 2018, 2022 ప్రపంచకప్‌లలో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన జర్మనీకి, ఈసారి నాకౌట్ తొలి మ్యాచ్‌లోనే పరాగ్వే రూపంలో ఊహించని పరాభవం ఎదురైంది.

జపాన్‌కు బ్రెజిల్ షాక్

అంతకుముందు జరిగిన మరో రౌండాఫ్ 32 నాకౌట్ పోరులో 5 సార్లు ఛాంపియన్ బ్రెజిల్ జపాన్‌కు షాకిచ్చింది. 21 తేడాతో జపాన్‌పై బ్రెజిల్ నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. మ్యాచ్ 29వ నిమిషంలో జపాన్ మిడ్‌ఫీల్డర్ కైషు సానో ఒక అద్భుతమైన గోల్ చేసి జపాన్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. బ్రెజిల్ డిఫెన్స్ లోపాన్ని వాడుకుంటూ సానో కొట్టిన ఈ షాట్ ఫస్ట్ హాఫ్‌లో జపాన్‌ను ముందంజలో ఉంచింది. సెకండ్ హాఫ్‌లో బ్రెజిల్ కోచ్ కార్లో అన్సెలొట్టి వ్యూహాలు ఫలించాయి. 56వ నిమిషంలో గాబ్రియేల్ మగల్హాస్ అందించిన క్రాస్‌ను స్టార్ ప్లేయర్ క్యాసిమిరో హెడర్ ద్వారా గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. చివరి నిమిషంలో ట్విస్ట్: మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీస్తుందనుకున్న తరుణంలో, ఇంజ్యూరీ టైమ్ (90+5వ నిమిషంలో) సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన గాబ్రియేల్ మార్టినెల్లీ బ్రూనో గుమారైస్ అందించిన పాస్‌ను అద్భుతమైన గోల్‌గా మార్చి బ్రెజిల్‌కు నాటకీయ విజయాన్ని అందించాడు.

నెదర్లాండ్స్ అవుట్

మరొక రౌండాఫ్ 32 పోరులో నెదర్లాండ్స్‌కు మొరాకో షాక్ ఇచ్చింది. నిర్ణీత 90 నిమిషాల సమయంలో ఇరు జట్లు కూడా చెరో గోల్ సాధించాయి. ఫలితంగా మ్యాచ్ అదనపు సమయానికి  దారి తీసింది. అదనపు సమయంలో ఇరు జట్లు కూడా గోల్స్ వేయడంలో విఫలం అయ్యాయి. దాంతో పెనాల్టీ షూటౌల్ అనివార్యమైంది. ఇక్కడ మొరాకో 3 2 తేడాతో నెదర్లాండ్స్‌కు షాక్ ఇచ్చి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *