Last Updated:
Viral News: సోషల్ మీడియా పుణ్యమా అని సమాజంలో ఎన్నో వింతలు, విచిత్రమైన వ్యక్తులను రోజూ చూస్తూనే ఉంటున్నాం. అయితే కొందరి జీవితాలు చూస్తే నిజంగా ఇలా జరుగుతాయా..? వాళ్లు సమాజంలో ఎలా తలెత్తుకొని తిరుగుతారు..? వాళ్ల బంధువులు, కుటుంబ సభ్యులు అలాంటి వాళ్ల నిర్ణయాన్ని స్వాగతిస్తారా లేక తమ నుండి వెలివేస్తారా అనే సందేహాలు కలుగుతాయి.
Viral News: సోషల్ మీడియా పుణ్యమా అని సమాజంలో ఎన్నో వింతలు, విచిత్రమైన వ్యక్తులను రోజూ చూస్తూనే ఉంటున్నాం. అయితే కొందరి జీవితాలు చూస్తే నిజంగా ఇలా జరుగుతాయా..? వాళ్లు సమాజంలో ఎలా తలెత్తుకొని తిరుగుతారు..? వాళ్ల బంధువులు, కుటుంబ సభ్యులు అలాంటి వాళ్ల నిర్ణయాన్ని స్వాగతిస్తారా లేక తమ నుండి వెలివేస్తారా అనే సందేహాలు కలుగుతాయి. ఇప్పుడు మీడియా వేదిక ఎక్స్‌లో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో కథ అందర్ని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఇక్కడ స్టోరీ ఏమిటంటే పెళ్లైన ఓ బిడ్డకు తల్లిదండ్రులుగా మారిన తర్వాత ఆ మహిళకు తన భర్తకు ఆడవాళ్లు అంటే ఇష్టం లేదని.. మగవాళ్లతో సుఖం పొందుతున్నాడని తెలుసుకుంది. అయితే మరి కొడుకు పుట్టిన తర్వాత కూడా ఆమె తన స్వలింగ సంపర్క మనస్తత్వం కలిగిన భర్తను ఏం చేసింది..? వాళ్ల జీవితానికి , వైవాహిక బంధానికి ఎలాంటి ముగింపు పలికిందనే విషయాన్ని వివరంగా పంచుకుంది.
సామాజిక మాధ్యమాల్లో చాలా మంది జీవిత కథలు, రియల్ లైఫ్‌లో సాధించిన సక్సెస్ స్టోరీలతో పాటు ఎక్కడా చూడని, ఎప్పుడూ వినని వార్తలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇప్పుడు ఓ యువతి వివేక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. విచిత్రం ఏమిటంటే అతడ్ని ప్రేమించి, పెళ్లి చేసుకున్న తర్వాత అంటే మూడేళ్లకు ఎథిన్ అనే బాబు పుట్టిన తర్వాత ఆమె ఊహించని నిజాన్ని కనుగొంది. అది ఏమిటంటే తన భర్త వివేక్కి ఆడవాళ్ల కంటే మగవాళ్లతో వ్యక్తిగత , శారీరక సహవాసం( రొమాన్స్) ఇస్టమని తెలిసి షాక్ అయింది. ఇంకా విచిత్రం ఏమిటంటే తన భర్తకు పెళ్లి కాక ముందు నుండే మరో యువకుడితో స్వలింగ సంపర్కం కలిగి ఉన్నాడని తెలిసి అతడ్ని కూడా తమ ఇంట్లోనే కింది ఫ్లోర్లో భర్త వివేక్‌తో కలిసి జీవించడానికి ఒప్పుకుంది. తన కొడుకు తాను అప్ స్టైర్ ఫ్లోర్లో ఉంటున్నారు.
Woman finds out that her husband is gay after they had a son, and she allows his husband to live with his gay partner in the same house. I sincerely believe women are stronger than men. pic.twitter.com/QOsHvbGzqn
— Lord Immy Kant (@KantInEastt) June 30, 2026
ఇలాంటి ఆసక్తికరమైన స్టోరీ వాళ్లకు సంబంధించిన ఫోటోలతో పాటు ట్విట్టర్(X)లో వైరల్ అవుతోంది. అయితే పెళ్లికి ముందు తాను గే అనే విషయాన్ని దాచి పెట్టిన వివేక్ పట్ల సదరు మహిళ కోపగించుకోలేదు. 2017లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత బిడ్డ పుట్టడం కూడా జరిగిపోయింది. అయితే తన భర్తకు ఉన్న లోపాన్ని చీదరించుకోకుండా ఆ సమస్య నుండి ఇద్దరూ బయటపడటానికి ఓ విభిన్నమైన ప్రేమను కనుగొన్నది. పెళ్లికి ముందు తన భర్త వేరే మగవాళ్లతో స్వలింగ సంపర్కం చేసిన విషయం పెళ్లి తర్వాత తెలియడంతో తమ బంధం నిలబడుతుందా లేక విడిపోయే పరిస్థితి వస్తుందా అనే ఆలోచన చేసింది. మూడేళ్ల పాటు తమ బంధం కచ్చితంగా నిలబడుతుందని నమ్మిన యువతి ఆ తర్వాత మా కొడుకు ఈథన్ పుట్టాడంతో భర్తతో రాజీ పడి జీవించాలా లేక ఎలా బ్రతకాలని తీవ్రమనోవేదనకు గురైనట్లుగా పోస్టులో వెల్లడించింది.
బిడ్డ పుట్టిన తర్వాత సదరు మహిళ హెల్త్ కండీషన్ చూసిన తర్వాత వివేక్ చివరకు నిజాన్ని అంగీకరించాడు. భార్యతో పెళ్లికి ముందు వేరే యువకుడితో స్వలింగ సంపర్కం ఉందని చెప్పాడు. అయితే విషయం తెలిసి గుండెను రాయిగా చేసుకున్న వివేక్ భార్య తల్లిదండ్రులుగా విడిపోవాలని నిర్ణయించుకుంది. కాకపోతే తన భర్త స్వలింగ సంపర్కరం పెట్టుకున్న వ్యక్తినే ఇంటికి పిలిపించి వారిద్దరికి ఓ గదిని కేటాయించింది. తాను తన బిడ్డ ఈథన్ మరో మరో గదిలో ఉంటూ భార్యభర్తలుగా విడిపోయి.. ఫ్రెండ్స్‌గా జీవిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తాను, వివేక్ వేర్వేరు గదుల్లో జీవిస్తున్నప్పటికి తమ బిడ్డ ఈథన్కు రెండు అంతస్తులూ అతని ఇల్లేనంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వివేక్ తాను భార్యాభర్తలం కాదని కాని ప్రాణ స్నేహితులమని చెబుతోంది. ఇప్పటికీ ఒక కుటుంబంలా కలిసే జీవిస్తున్నారు. అయితే ఈ విచిత్రమైన స్టోరీ చూసిన వాళ్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. కొందరు ఆమె భర్త శీలాన్ని అనుమానిస్తున్నారు. అతను గే అంటే మీకు అతని వల్ల బిడ్డ ఎలా పుట్టాడని ప్రశ్నిస్తున్నారు..? మరికొందరు ఈమె వర్జినిటీని సందేహిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
ఎవరు ఏమనుకున్నా.. ఎవరు ఎలా నిందించినా పెళ్లైన ఓ జంట ఈవిధంగా ఒకే ఇంట్లో అంటే భర్త తనతో కాకుండా ఓ మగవాడితో శారీరక సంబంధం పెట్టుకోవడం చూసి తట్టుకోవడం, క్షమించడం అనేది చాలా గొప్ప విషయని.. ఏది ఏమైనా మగవాళ్ల కంటే ఆడవాళ్లే చాలా ధైర్యవంతులు అని మరోసారి నిర్ధారణ జరిగిందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టడం గమనార్హం.
Hyderabad,Telangana













