Last Updated:
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ముందు గుజరాత్ టైటాన్స్ భారీ లక్ష్యానుంచింది. GT చెన్నై బౌలర్లకు చుక్కులు చూపించారు. నిర్ణీత ఓవర్ణలో 4 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ మెరుపులతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు గుజరాత్ టైటాన్స్ భారీ టార్గెట్ విసిరింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ కీలక పోరులో మొదట బ్యాటింగ్ చేసిన GT బ్యాటర్లు CSK బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. పవర్‌ప్లే నుంచే దూకుడుగా ఆడిన ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ చెన్నై బౌలింగ్‌ను చిత్తు చేస్తూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు.
ఇద్దరూ తొలి వికెట్‌కు 125 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి GTకి అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. కెప్టెన్ గిల్ తన క్లాస్ బ్యాటింగ్‌తో కేవలం 37 బంతుల్లో 64 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన గిల్ CSK బౌలర్లపై ఎటాక్ కొనసాగిస్తూ మ్యాచ్‌ను పూర్తిగా గుజరాత్ వైపు తిప్పేశాడు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో అతడు ఔట్ కావడంతో చెన్నైకి కాస్త ఊరట లభించింది.
అయితే మరో ఎండ్‌లో సాయి సుదర్శన్ మాత్రం అదే జోరు కొనసాగించాడు. ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిర్మించిన అతడు 53 బంతుల్లో 84 పరుగులు చేసి GT స్కోర్‌ను మరింత ప్రమాదకర స్థితికి తీసుకెళ్లాడు. టైమింగ్, షాట్ సెలక్షన్‌తో ఆకట్టుకున్న సుదర్శన్ చెన్నై బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చివర్లో అతడు క్యాచ్ ఔట్ అయినప్పటికీ అప్పటికే గుజరాత్ మ్యాచ్‌పై గట్టి పట్టును సాధించింది.
డెత్ ఓవర్లలో జోస్ బట్లర్ కూడా తన పవర్ హిట్టింగ్‌తో మెరిపించాడు. వేగంగా పరుగులు రాబట్టిన బట్లర్ అర్ధ సెంచరీ పూర్తి చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి దూకుడు బ్యాటింగ్‌తో చివరి ఓవర్లలో GT స్కోర్ మరింత వేగంగా పెరిగింది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.
ఇప్పుడు ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే చెన్నై సూపర్ కింగ్స్ 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. ఈ పిచ్‌పై బ్యాటర్లకు సహకారం ఉన్నప్పటికీ, ఒత్తిడి పరిస్థితుల్లో CSK ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













