Mumbai Rains: సబ్‌వేలు బంద్.. కుంగిన రోడ్లు.. వర్షాలతో ముంబై అతలాకుతలం.. హై అలర్ట్! | | ACTPnews

ముంబై వర్షాలు


Last Updated:

Mumbai Rains: మహారాష్ట్రలో నైరుతి రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చాయి. రాజధాని ముంబైతో పాటు దాని పరిసర ప్రాంతాలను శనివారం భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ముంబై నగరం దాదాపు స్తంభించిపోయింది.

ముంబై వర్షాలు
ముంబై వర్షాలు

ముంబై నగరంలో నెలకొన్న భీభత్సానికి సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమం ఎక్స్ (X)లో వైరల్‌గా మారుతున్నాయి. తీవ్రమైన హైటైడ్ (సముద్రపు పోటు) కారణంగా ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద భారీ అలలు ఎగసిపడుతుండగా, వసాయి ప్రాంతంలో కురిసిన నిరంతర వర్షాలకు రోడ్లన్నీ నీట మునిగాయి. నవీ ముంబైలో కూడా వీధులన్నీ చెరువులను తలపిస్తుండటంతో వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి. వర్షాల ధాటికి అంధేరి, మలాడ్ సబ్‌వేలు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ రెండు మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. ఫలితంగా పశ్చిమ శివారు ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్డు కుంగి గుంతలోకి వెళ్లిన వాహనం!

భాండూప్ పరిధిలోని సోనాపూర్ ప్రాంతంలో ఒక నిర్మాణ స్థలం సమీపంలో నిరంతర వర్షాల కారణంగా రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది (Road Cave-in). దాంతో అక్కడ నిలిపి ఉంచిన ఒక వాహనం ఆ గుంతలోకి మునిగిపోయింది. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. ముంబైతో పాటు పక్కనే ఉన్న థానే, పాల్ఘర్ జిల్లాల్లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడటంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది.

రెడ్ అలర్ట్ జారీ.. స్కూళ్లకు సెలవులు

ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో రాబోయే గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యగా ముంబైలోని పాఠశాలలు, కళాశాలలకు శనివారం మధ్యాహ్నం సెషన్ నుండి సెలవు ప్రకటించారు. లోకల్ రైళ్ల రాకపోకలకు కూడా స్వల్ప అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాలలో ఇళ్లు కూలిపోయిన ఘటనలు కూడా నమోదయ్యాయి.

జూలై 6 వరకు ప్రయాణాలు వద్దు: సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌తో పాటు పుణే, నాసిక్ బెల్ట్‌లలో ఉన్న ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కోరారు. జూలై 6 వరకు భారీ వర్షాలు మరియు పిడుగులతో కూడిన పవనాలు వీచే అవకాశం ఉన్నందున, ప్రజలందరూ ప్రభుత్వ అధికారిక సూచనలను పాటించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports