Last Updated:
యశ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ మూవీ నుంచి ‘తబాహి’ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ వీడియోలో యశ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు రొమాంటిక్ సీన్స్ హైలైట్ అవుతున్నాయి. ముఖ్యంగా యశ్, కియారాల జోడీ, వారి మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు కాక రేపుతున్నాయి.
యశ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ మూవీ నుంచి ‘తబాహి’ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ వీడియోలో యశ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు రొమాంటిక్ సీన్స్ హైలైట్ అవుతున్నాయి. ముఖ్యంగా యశ్, కియారాల జోడీ, వారి మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు కాక రేపుతున్నాయి. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై యశ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రవి బస్రూర్, తనిష్క్ బాగ్చీ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను ఆగస్టు 26న గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
‘కేజీఎఫ్’ సిరీస్‌తో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న యష్.. ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్‌ను చెక్కు చెదరకుండా కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంతలా అంటే.. ఇప్పుడు ఆయనకున్న మాస్ అప్పియరెన్స్‌కు ఖచ్చితంగా వైలెన్స్ ఉన్న సినిమానే చేయాలి లేదంటే జనాలు యాక్సెప్ట్ చేయరు అనేంతలా. అందుకే.. కేజీఎఫ్ సిరీస్ తర్వాత దాదాపు రెండేళ్లు ఎన్నో కథలు విని చివరికి టాక్సిక్ సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో మరీ రెచ్చిపోయి నటిస్తున్నాడు.
ఈ సినిమా టీజర్ రిలీజైన తర్వాత ఇండియాలో పెను సంచలనమే సృష్టించింది. కొందరు హాలీవుడ్ స్టైల్ మేకింగ్ అని పొగడ్తలు కురిపిస్తే.. మరికొందరు మాత్రం మసాలా కంటెంట్ ఏంటి ఈ రేంజ్లో ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా తీస్తుంది అమ్మాయేనా అంటూ ఓ రేంజ్లో రెచ్చిపోయారు. కానీ గీతూ మోహన్ దాస్ మాత్రం ఎవరేమనుకున్నా సరే.. నాకు నచ్చిన విధంగా సినిమా తీస్తా అనేలా రెస్పాన్స్ ఇచ్చింది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













