Cyber ​​Fraud: బిజినెస్‌మెన్ ఖాతా నుండి డ్రా అయిన రూ.94.88 లక్షలు 3 గంటల్లోనే జమ.. సైబర్ నేరగాళ్లకు ఇలా చెక్ పెట్టాడు | | ACTPnews

Cyber ​​Fraud


Last Updated:

Cyber ​​Fraud: రోజూ ఏదో ఒకచోట జరుగుతున్న సైబర్ మోసాల గురించి మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఈ రోజుల్లో ఇటువంటి ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును కాజేయడానికి సైబర్ నేరగాళ్లు నిరంతరం కొత్త కొత్త పద్ధతులను రూపొందిస్తుంటారు.

Cyber ​​Fraud
Cyber ​​Fraud

Cyber ​​Fraud: రోజూ ఏదో ఒకచోట జరుగుతున్న సైబర్ మోసాల గురించి మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఈ రోజుల్లో ఇటువంటి ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును కాజేయడానికి సైబర్ నేరగాళ్లు నిరంతరం కొత్త కొత్త పద్ధతులను రూపొందిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో “డిజిటల్ అరెస్ట్” పేరుతో బాధితుల నుండి లక్షల లేదా కోట్ల రూపాయలను వసూలు చేస్తుండగా మరికొన్ని సందర్భాల్లో ఆకర్షణీయమైన పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి వారి బ్యాంక్ ఖాతాలలోని డబ్బును కాజేస్తున్నారు. అంతేకాకుండా మోసగాళ్లు ప్రజల మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసి వారి బ్యాంక్ అకౌంట్ల నుండి లక్షల లేదా కోట్ల రూపాయలను కాజేస్తున్నారు. సైబర్ మోసానికి గురై డబ్బును కోల్పోయిన బాధితులు చాలామంది నిస్సహాయతతో, తీవ్ర పశ్చాత్తాపంతో మిగిలిపోతుంటారు. అయితే మీరు సైబర్ మోసానికి గురైనట్లు తెలిసిన మరుక్షణమే స్పందించి అప్రమత్తంగా వ్యవహరిస్తే మీ డబ్బును తిరిగి సులువుగా పొందవచ్చు. ఇందుకు ఉదాహరణే రాజస్థాన్‌లోని పాలిలో జరిగిన సంఘటన.

నష్టపోయామని బాధ పడటం కాదు..

ఏదైనా నష్టపోయినప్పుడు, లేదంటే కోల్పోయినప్పుడు మనకు బాధ తప్ప వేరే ఆలోచన గుర్తుకు రాదు. మరీ ముఖ్యంగా ఈమధ్య కాలంలో పెరిగిపోయిన సైబర్ క్రైమ్ నేరాల విషయంలో ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే డబ్బు నష్టపోవడం లేదా సైబర్ మోసానికి గురైన సందర్భంలో చింతించడం కంటే ముందు వెంటనే తేరుకొని సమయస్పూర్తితో వ్యవహరించాలి. పాలీకి చెందిన వ్యాపారవేత్త సయ్యద్ రహత్ అలీకి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. ఒక సైబర్ మోసగాడు ఆయనను సుమారు కోటి రూపాయల మేర మోసం చేశాడు. అయితే తాను మోసపోయానని గ్రహించిన ఆయన వెంటనే స్పందించి, తన డబ్బును తిరిగి పొందగలిగారు. మోసం జరిగిన కొద్ది గంటల్లోనే మొత్తం సొమ్మును తిరిగి రాబట్టిన ఈ ఉదంతం రాజస్థాన్‌లోని పాలీ జిల్లా సోజత్‌లో వెలుగుచూసింది. ఒక సైబర్ మోసగాడు ఒక వ్యాపారవేత్త ఖాతా నుండి రూ.9,488,228 కాజేశాడు. అయితే ఆ వ్యాపారవేత్త అప్రమత్తత , బ్యాంకు, పోలీసుల మధ్య సమర్థవంతమైన సమన్వయం కారణంగానే కేవలం మూడు గంటల్లోనే అతను కోల్పోయిన ఆ మొత్తం సొమ్మును తిరిగి పొందగలిగారు బిజినెస్‌మెన్.

ఆ వ్యాపారవేత్త బ్యాంక్ ఖాతా నుండి రూ.94,88,228 మాయం..

ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ సోజత్ శాఖ మేనేజర్ రాహుల్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం సయ్యద్ అనే ఆ వ్యాపారవేత్తకు ఆ శాఖలో ఖాతా ఉంది. గురువారం నాడు సయ్యద్ మొబైల్ ఫోన్ హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. అతని బ్యాంక్ ఖాతా నుండి రూ.94,88,228 మాయం చేశారు. ఈ సైబర్ మోసం గురించి తెలుసుకున్న సయ్యద్ మొదట షాక్‌కి గురయ్యాడు. డబ్బు డ్రా అయినట్లు నోటిఫికేషన్ రాగానే ఆయన అలర్ట్ అయ్యాడు. ఆ వ్యాపారవేత్త వెంటనే జైపూర్ సైబర్ సెల్, డిజిటల్ బృందానికి ఆన్‌లైన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చాడు.

అకౌంట్ నుండి డ్రా అయిన మనీ బ్లాక్..

ఈ సమాచారం అందిన వెంటనే ICICI బ్యాంక్ సోజత్ శాఖ వేగంగా స్పందించింది. ఆ నిధులను నిలిపివేసేందుకు శాఖా మేనేజర్ రాహుల్ అగర్వాల్ వెంటనే పోలీసులు, బ్యాంక్ డిజిటల్ బృందం PayUతో సమన్వయం చేసుకున్నారు. అదే సమయంలో ఆ సైబర్ మోసగాడి ఖాతాను ఫ్రీజ్ చేశారు. దీనివల్ల వ్యాపారవేత్త సయ్యద్ రహత్ అలీ ఖాతా నుండి డెబిట్ అయిన రూ.94.88 లక్షల మొత్తం తిరిగి ఆయన ఖాతాలో జమ చేయబడింది. ఈ ప్రక్రియ అంతా కేవలం మూడు గంటల్లోనే పూర్తయింది. బ్యాంకు చూపిన అప్రమత్తత, తక్షణ స్పందనపై ఆ ప్రాంతమంతటా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఇకపై ఇలా చేస్తే బెటర్..

అందుకే ఎవరికైనా మీ బ్యాంక్ వివరాలు, ఇతర పథకాల గురించి లబ్ది పొందారని చేసే కాల్స్, రుణాలిస్తామని చెప్పే వాళ్లను నమ్మి మోసపోవద్దు. ఒకవేళ తెలియకుండా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడితే వెంటనే బ్యాంక్ అధికారులకు సమాచారం ఇస్తే జరగబోయే నష్టాన్ని ముందుగానే అరికట్టడానికి ఛాన్సుంటుందని అధికారులు సూచిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed