Last Updated:
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ను సినీ నటుడు కమల్‌హాసన్ (Kamal Haasan) కలిశారు. ఈ సందర్భంగా విజయ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా ఫొటోలను ఈ పంచుకోవడంతో విజయ్- కమల్ హాసన్ మీటింగ్ పై సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి.
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, దళపతి విజయ్ను శనివారం (మే 16, 2026) ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ మర్యాదపూర్వకంగా కలిశారు. మే 10న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన మొదటి అధికారిక భేటీ ఇది. ఈ సందర్భంగా విజయ్‌కు కమల్ హాసన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా, ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్న తమిళ సినీ పరిశ్రమ (కోలీవుడ్) అభివృద్ధి కోసం 6 ప్రధాన డిమాండ్లతో కూడిన ఒక నివేదికను సీఎంకు సమర్పించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకోవడంతో ఈ సమావేశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ భేటీ అనంతరం కమల్ హాసన్ స్పందిస్తూ.. “తమిళనాడు శ్రేయస్సు కోసం సోదరుడు విజయ్ కన్న కలలు, ఆలోచనలను నాతో పంచుకున్నారు. ఆయన చూపిన వినయం, ఆప్యాయత నన్ను ఎంతో గర్వపడేలా చేశాయి” అని పేర్కొన్నారు. అంతేకాకుండా, బాధ్యతలు చేపట్టిన వెంటనే పాఠశాలలు, గుడుల సమీపంలో ఉన్న 717 మద్యం షాపులను (TASMAC) మూసివేయాలని విజయ్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని లోకనాయకుడు అభినందించారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సాయం అవసరం అని, ఇదే విషయాన్ని సీఎం విజయ్ దృష్టికి తీసుకొచ్చి 6 ముఖ్య డిమాండ్లను ఆయన ముందు పెట్టానని కమల హాసన్ పేర్కొన్నారు.
மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர், தம்பி விஜய் @TVKVijayHQ அவர்களை இன்று நேரில் சந்தித்து வாழ்த்துகளைத் தெரிவித்தேன்.
தமிழ்நாட்டை மேம்படுத்தும் பல கனவுகளை உற்சாகத்துடன் பகிர்ந்துகொண்டார். சந்திப்பின்போது அவர் காட்டிய பண்பும் அன்பும் நெகிழ்ச்சியளித்தது.பல்வேறு இடையூறுகளைச்… pic.twitter.com/timwTZeEdY
— Kamal Haasan (@ikamalhaasan) May 16, 2026
అయితే ఆ డిమాండ్స్ ఏంటి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. న్యూస్ 18 కన్నడ రిపోర్ట్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వానికే సొంతంగా ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలన్నది కమల్ హాసన్ మొదటి డిమాండ్. తమిళ సినిమా, స్వతంత్ర చిత్రాలు, డాక్యుమెంటరీలు వంటివాటిని తక్కువ ధరలకే ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది చిన్న నిర్మాతలకు, కొత్త దర్శకులకు ఒక పెద్ద వేదిక కాగలదు.
స్థానిక సంస్థలకు వినోద పన్ను రద్దు: సినిమా నిర్మాణం, పంపిణీ ఖర్చులు పెరుగుతున్న తరుణంలో, 4 శాతం స్థానిక సంస్థల వినోద పన్ను చిత్ర పరిశ్రమపై అదనపు ఒత్తిడిని పెంచింది. ఈ పన్నును రద్దు చేస్తే థియేటర్లు, నిర్మాతలు, పంపిణీదారులు అందరికీ ప్రయోజనం చేకూరుతుంది. ఈ డిమాండ్‌ను తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని కమల్ హాసన్ అన్నారట.
పైరసీపై ఉక్కుపాదం: చిత్ర పరిశ్రమకు పైరసీ ఒక పెద్ద తలనొప్పి. పైరసీ కంటెంట్ వల్ల కళాకారులు నాశనమవుతున్నారన్నది కొత్త విషయమేమీ కాదు. తమిళనాడు పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం కింద ఒక ప్రత్యేక పైరసీ నిరోధక బృందాన్ని ఏర్పాటు చేస్తే, పైరసీ కంటెంట్‌ను తక్షణమే తొలగించే అవకాశాలు పెరుగుతాయి.
8 వారాల తప్పనిసరి OTT విడుదల: తమిళనాడులో విడుదలయ్యే అన్ని సినిమాలు విడుదలైన వెంటనే ఓటీటీకి వెళ్లకుండా ఉండేలా ఒక నిబంధన తీసుకురావాలని కమల్ హాసన్ సూచించారు. కనీసం 8 వారాల విరామం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
రోజుకు 5 ప్రదర్శనలకు అనుమతి: తమిళనాడులోని అన్ని సినిమా హాళ్లకు రోజుకు 5 షోలు నడపడానికి చట్టపరమైన అనుమతి ఇవ్వాలి. దీనివల్ల సినిమా హాళ్ల ఆదాయం పెరిగి, ఇబ్బందుల్లో ఉన్న ఎగ్జిబిషన్ రంగం కోలుకోవడానికి సహాయపడుతుంది.
సినిమా నిర్మాణ ప్రోత్సాహకం: మరో ముఖ్యమైన సూచన ఏమిటంటే, తమిళనాడులో 50% కంటే ఎక్కువ చిత్రీకరణ జరిపే భారతీయ చిత్రాలకు, బడ్జెట్లో 10% నిర్మాణ ప్రోత్సాహకాలను అందించే పథకాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. దీనివల్ల తమిళనాడు చిత్రీకరణకు మొదటి ఎంపికగా నిలవడంతో పాటు, రాష్ట్ర పర్యాటక రంగానికి కూడా ఇది సహాయపడుతుంది. మొత్తం మీద, తమిళ సినిమాకు చెందిన ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన ఈ భేటీ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. సీనియర్ నటుడు కమల్ హాసన్ చేసిన ఈ డిమాండ్లకు సీఎం విజయ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
May 17, 2026 10:14 AM IST













