KTR Fire On Revanth Reddy : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు! | ACTPnews

KTR Fire On Revanth Reddy : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!



భద్రాచలానికి అసలైన ముప్పు పోలవరం ప్రాజెక్ట్ వల్లే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ముంపు కోసమే కదా భద్రాచలంలోని కొన్ని మండలాలను బీజేపీ ఏపీలో కలిపింది, మరి దీనిపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై హరీష్ రావు కేంద్రానికి లేఖ రాస్తే సర్వే టీంను కూడా పంపించిందని గుర్తు చేశారు. రాముడి గురించి, భద్రాచలం గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, అబద్ధాలు చెప్తే నష్టపోతావంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *