Last Updated:
Lindsey Graham: అమెరికా సీనియర్ సెనేటర్, రిపబ్లికన్ పార్టీ కీలక నేత లిండ్సే గ్రాహం ఆకస్మిక మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతుండగా, ఇరాన్ మాత్రం దీనిని స్వాగతిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
మరోవైపు, సౌత్ కారోలినాకు చెందిన 71 ఏళ్ల ఈ నేత మరణం వెనుక ఉన్న పరిస్థితులపై సోషల్ మీడియాలో పలు కుట్ర సిద్ధాంతాలు (Conspiracy Theories) హల్చల్ చేస్తున్నాయి. గ్రాహం మరణంపై ఇరాన్ మీడియా ఒక ప్రకటనను ప్రసారం చేసింది: “యుద్ధ పిపాసి, ఇరాన్ వ్యతిరేకి అయిన అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం నరకానికి చేరినందుకు ఇరాన్ దేశ ప్రజలకు అభినందనలు.” ఆయన మరణించడానికి కొన్ని రోజుల ముందే, తాము టార్గెట్ చేయబోయే వ్యక్తుల జాబితాలో గ్రాహం ఉన్నట్లు ఇరాన్ బహిరంగంగా ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే, గ్రాహంపై ఇరాన్ లేదా రష్యా విషప్రయోగం చేసి ఉండవచ్చని లేదా హత్య చేసి ఉండవచ్చని సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, ఈ ఆరోపణలను బలపరిచే ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు అధికారికంగా బయటకు రాలేదు.
సెనేటర్ లిండ్సే గ్రాహం కార్యాలయం ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది:
“శనివారం (జూలై 11) సాయంత్రం, యుఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహం స్వల్ప, ఆకస్మిక అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈ అత్యంత కష్టసమయంలో సెనేటర్ గ్రాహం కుటుంబం అందరి ప్రార్థనలను కోరుకుంటోంది మరియు వారి వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని అభ్యర్థిస్తోంది.”
వైద్య నివేదికల ప్రకారం, ఆయన గుండెపోటుతో (Cardiac Arrest) మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
గ్రాహం మరణించడానికి కేవలం ఐదు రోజుల ముందే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ఆయనను బహిరంగంగా హెచ్చరించినట్లు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా, ఆయన ఇటీవల ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పర్యటించి, ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కలిశారు. రష్యాపై మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించే ప్యాకేజీపై చర్చించారు. ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగి వచ్చిన 24 గంటల లోపే ఆయన కుప్పకూలి మరణించారని వార్తలు వస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం, ఇది సాధారణ గుండె జబ్బు లేదా రక్తనాళాల్లో పూడికల వల్ల జరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.
5 days ago, Senator Lindsey Graham posted about how the IRGC threatened to assassinate him. They threatened to assassinate me and President Trump as well with matching posters of our faces held by IRGC operatives at Khameini’s funeral that called for our heads to roll.
Now,… https://t.co/nOhswRJG6I
— Laura Loomer (@LauraLoomer) July 12, 2026
ప్రముఖ కన్జర్వేటివ్ వ్యాఖ్యాత లారా లూమర్, గ్రాహం మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్విట్టర్ (X) లో వరుస పోస్టులు పెట్టారు. విదేశీ శత్రువులు ఆయనపై విషప్రయోగం చేసి ఉండవచ్చని, “స్వల్ప మరియు ఆకస్మిక అనారోగ్యం” అంటే ఏమిటో స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. టెహ్రాన్‌లో అలీ ఖమేనీ అంత్యక్రియలకు రష్యా ప్రతినిధి బృందాన్ని పంపిన విషయాన్ని ప్రస్తావిస్తూ, రష్యా ప్రమేయంపై కూడా సమగ్ర దర్యాప్తు జరపాలని, టాక్సికాలజీ (విషప్రయోగ నిర్ధారణ) నివేదికను సేకరించాలని కోరారు.
మరో అమెరికన్ రచయిత రబ్బీ ష్మూలీ స్పందిస్తూ, “నేను కుట్ర సిద్ధాంతాలను నమ్మేవాడిని కాను. కానీ ఇరాన్, రష్యాలకు అతిపెద్ద శత్రువైన లిండ్సే గ్రాహం.. ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన మరుసటి రోజే చనిపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది” అని పేర్కొన్నారు.
అమెరికా రాజకీయాల్లో ఇరాన్‌ను తీవ్రంగా వ్యతిరేకించే నేతల్లో లిండ్సే గ్రాహం ఒకరు. టెహ్రాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించాలని, అణు ఒప్పందాలను పునరుద్ధరించకూడదని ఆయన గట్టిగా వాదించేవారు. అలాగే ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు ఇచ్చారు. 2022లో ఇజ్రాయెల్ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ అణు శాస్త్రవేత్తలకు మరిన్ని “ప్రమాదాలు” ఎదురవుతాయని, ఇరాన్ సిద్ధాంతం నాజీజం లాంటిదని వ్యాఖ్యానించడం అప్పట్లో ఇరు దేశాల మధ్య తీవ్ర రాజకీయ వైరాగ్యానికి దారితీసింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














