PBKS vs MI: పంజాబ్ భారీ స్కోర్.. 4 వికెట్లతో రాణించిన శార్దుల్ ఠాకూర్.. ముంబై టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews

credit: bcci


Last Updated:

ఐపీఎల్ 2026లో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 200, ప్రభుసిమ్రన్ 57, అజ్మతుల్లా ఓమర్‌జై 38, ముంబైకి శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లు

credit: bcci
credit: bcci

ఐపీఎల్ 2026లో భాగంగా నేడు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌తో ముంబై తలపడింది. టాస్ ఓడి  బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 200 పరుగులు సాధించింది. ఓపెనర్ ప్రభుసిమ్రన్ 57 (6 ఫోర్లు, 4 సిక్సులు) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లు తీసి టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ఓపెనర్ ప్రియాంష్ ఆర్య (22), కూపర్ కొన్నొలి (21) మినహా టాప్ ఆర్డర్ మొత్తం చేతులెత్తేసింది. శ్రేయస్ అయ్యర్ (4), సూర్యాంశ్ (8), శశాంక్ (2).. ఇలా కీలక ప్లేయర్లంతా తక్కువ పరుగులకే ఔటయ్యారు. ఐతే చివర్లో వచ్చిన అజ్మతుల్లా ఓమర్‌జై 38 (4 సిక్సులు, 2 ఫోర్లు), బార్ట్‌లెట్ (18*), విష్ణు వినోద్ (15*) వేగంగా పరగులు చేయడంతో పంజాబ్ భారీ స్కోర్ చేయగలిగింది. ఇక ముంబై బౌలర్లలో శార్దుల్ 4, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, రాజ్ బవా చెరో వికెట్ పడగొట్టారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports