Last Updated:
నాన్‌స్టాప్ నవ్వులు పండించడానికి టాలీవుడ్ తెరపైకి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైన్మెంట్ మూవీ రాబోతోంది. దీనికి చాలా వైవిధ్యంగా “ముసలోడికి దసరా పండుగ” అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా మే 15న మూవీ రిలీజ్ కానుంది.
నాన్‌స్టాప్ నవ్వులు పండించడానికి టాలీవుడ్ తెరపైకి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైన్మెంట్ మూవీ రాబోతోంది. రాజీ నాయుడు – సీతమ్మ వాళ్లె ఆశీస్సులతో రమణా ఫిలిమ్స్ బ్యానర్‌పై యువ నిర్మాత రమణ వాళ్లె ఈ ద్విభాషా చిత్రం నిర్మిస్తున్నారు. దీనికి చాలా వైవిధ్యంగా “ముసలోడికి దసరా పండుగ” అనే టైటిల్ పెట్టారు. విలక్షణ నటుడు నాజర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం మే 15న థియేటర్‌లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ట్రైలర్ ప్రచార చిత్రాలతో భారీ అంచనాలు అందుకున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా నిర్మాత రమణ వాళ్లె మాట్లాడుతూ.. “ప్రేక్షకులు థియేటర్‌కు వస్తే రెండు గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. సినిమా అవుట్‌పుట్ పట్ల మేము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలం. ఈ సినిమాను మా పితృ సమానులు దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు అంకితమిస్తున్నాం” అని తెలిపారు.
చాలా కాలం తర్వాత తెలుగు తెరపైకి ఫ్యామిలీ ఎమోషన్స్, ఫుల్ లెంగ్త్ కామెడీతో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నాజర్‌తో పాటు అంజలి (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేం), అనిత (నువ్వు నేను ఫేం), కోవై సరళ, శరణ్య, సత్య వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. డి. ఇమాన్ సంగీతం అందిస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













