Fuel Saving India: సైకిల్ యాత్రతో పొదుపు సందేశం.. మోదీ చెప్పారని కాదన్న భూమన కరుణాకర్ రెడ్డి | | ACTPnews

fuel


Last Updated:

Viral Video: దేశ ఆర్థిక పరిస్థితులు, రాబోయే ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రజలకు పొదుపు అవసరంపై కీలక సందేశం ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. ప్రధాని చేసిన హెచ్చరికలను ప్రతి భారతీయుడు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

+

fuel saving India

Viral Video: దేశ ప్రజలు దుబారా(అనవసరమైన ఖర్చులు) తగ్గించుకోవాలి. ఆర్ధికంగా స్థిరపడాలంటే, ఆదాయం పెంచుకోవాలంటే కొన్ని ప్రత్యేక పద్దతులు పాటించడం, అందుబాటులో ఉన్న వనరులు, ప్రభుత్వాలు కల్పించే సౌకర్యాలను ఉపయోగించుకోవాలి. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాట. అయితే దేశ పాలకుడిగా ఆయన చెప్పిన మాటలను అటు అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు పాటిస్తే మంచిదే కదా అనే ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే తిరుపతిలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దేశ ఆర్థిక పరిస్థితులు, రాబోయే ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రజలకు పొదుపు అవసరంపై కీలక సందేశం ఇచ్చారు. ప్రధాని చేసిన హెచ్చరికలను ప్రతి భారతీయుడు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రవాణా విషయంలో కార్లు, బైక్స్ వాడుతూ ఇంధనం కోసం డబ్బు ఖర్చు చేయడం కంటే అవసరం మేరకు సైకిల్ వాడకం అన్నీ విధాలుగా మంచిదని సూచిస్తున్నారు.

ఖర్చులు తగ్గించుకుంటే ఆదాయం పెరిగినట్లే..

దేశ భవిష్యత్తు ఆర్థికంగా బలంగా ఉండాలంటే ప్రతి కుటుంబం ఇప్పటి నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలని సూచించారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని సూచన మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తిరుపతిలో సుమారు 10 కిలోమీటర్ల మేర వరకు సైకిల్ యాత్ర నిర్వహించినట్లు తెలిపారు. పెరుగుతున్న ఇంధన వినియోగం, విద్యుత్ దుర్వినియోగం, అధిక ఖర్చులు దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పెడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అవసరానికి మించి వనరులను వినియోగిస్తే భవిష్యత్తులో తీవ్ర సంక్షోభ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.

పొదుపు కోసం కొత్త ప్రయత్నం..

పొదుపు అనేది రాజకీయ పార్టీలకో, వ్యక్తులకో సంబంధించిన అంశం కాదని.. ఇది 140 కోట్ల భారతీయులందరి బాధ్యత అని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న నాయకులు మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో కూడా పొదుపు పాటించాలని పరోక్షంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేశారు. కాన్వాయ్‌లు తగ్గించడం, అనవసర ఖర్చులను నియంత్రించడం, ప్రభుత్వ వనరులను జాగ్రత్తగా వినియోగించడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. పాలకులతో పాటు వారి కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా సాధారణ జీవన విధానాన్ని అనుసరించాలని కోరారు. దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో పొదుపు భావన పెంపొందించే బాధ్యతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే చేపట్టిందని ఆయన తెలిపారు.

మోదీ మాటే శిరసావహిస్తాం..

ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంధనం పొదుపుతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వైపు ఆంధ్రప్రదేశ్ లోని ప్రజాప్రతినిధులు మొగ్గు చూపుతున్నారు. మాజీ ఏపీ బీజేపీ చీఫ్ , ఎమ్మెల్సీ సోము వీర్రాజు నూతన ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేశారు. ఏపీ సీఎం సైతం తన కాన్వాయ్‌ని 12 వాహనాల నుండి 4 వాహనాలకు కుదించుకున్నారు. 2 వాహనాలు ఎన్ఎస్‌జీ భద్రత, ఎస్కార్ట్ తో పాటు తన బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో గురువారం సచివాలయానికి వెళ్లారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించాలని పిలుపునిచ్చారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports