Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి.. ఊపిరాడక 52 మందికి అస్వస్థత! | | ACTPnews

News18


Last Updated:

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. స్వామివారి రథం సాగే బడా దండా (గ్రాండ్ రోడ్) ప్రాంతంలో జనసంద్రం పోటెత్తడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ క్రమంలో ఊపిరాడక 52 మంది భక్తులు అస్వస్థతకు గురవగా, రెస్క్యూ బృందాలు వారిని సురక్షితంగా రక్షించాయి.

News18
News18

ఒడిశా పూరీ జగన్నాథ రథయాత్రలో భారీ రద్దీ కారణంగా అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి రథం సాగే బడా దండా (గ్రాండ్ రోడ్) వీధిలో భక్తులు పోటెత్తడంతో విపరీతమైన తోపులాట జరిగి, శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురైన 52 మంది భక్తులను స్పెషల్ రెస్క్యూ యూనిట్ (SRU) బృందాలు వేగంగా స్పందించి రక్షించాయి. తీవ్ర ఇబ్బంది పడిన వారిలో కనీసం 33 మంది భక్తులను తక్షణమే చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం వారికి వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందుతోంది. కుండపోత వర్షంలోనూ భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎక్కడా తొక్కిసలాట జరగకుండా పోలీసులు, సహాయక బృందాలు జనసందోహాన్ని అదుపు చేస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు స్పష్టం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports