Tirumala Protocol Controversy: తిరుమలలో మాజీ డిప్యూటీ సీఎం ఆగ్రహం.. ఉద్దేశపూర్వకంగానే అవమానించారు అంటూ ఫైర్..! | | ACTPnews

News18


Last Updated:

మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి టీటీడీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘన, రాజకీయ వివక్ష ఆరోపణలు చేశారు.

+

News18

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన మాజీ ఉపముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నారాయణ స్వామి టీటీడీ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు ప్రోటోకాల్ ప్రకారం ప్రత్యేక దర్శనం కల్పించాల్సి ఉండగా, ఉద్దేశపూర్వకంగానే జనరల్ బ్రేక్ దర్శనం కోసం వేచి ఉండే కంపార్ట్‌మెంట్‌లో కూర్చోబెట్టారని ఆరోపించారు. తాను అక్కడ వేచి ఉండగా ఓ టీటీడీ ఉద్యోగి కూడా ఈ పరిస్థితిని చూసి బాధ వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఇది సాధారణ పరిపాలనా లోపం కాదని, తన రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జరిగిన వ్యవహారంగా భావిస్తున్నానని అన్నారు.

ఈ సందర్భంగా తాను దళితుడిననే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆరోపణలు చేయడం లేదని నారాయణ స్వామి స్పష్టం చేశారు. ఒక మాజీ ప్రజాప్రతినిధిగా తనకు లభించాల్సిన గౌరవం, ప్రోటోకాల్ విషయంలోనే ప్రశ్నిస్తున్నానని చెప్పారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిననే కారణంతోనే ఈ పరిస్థితి ఎదురైందని ఆరోపించారు. రాజకీయ విభేదాలు దేవాలయ పరిపాలనలో ప్రతిబింబించకూడదని, భక్తులందరికీ సమాన గౌరవం కల్పించేలా టీటీడీ వ్యవహరించాలని సూచించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, దేవస్థానం అధికారులను ఉద్దేశించి నారాయణ స్వామి కీలక విజ్ఞప్తి చేశారు. ఇకపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు ప్రత్యేక బ్రేక్ దర్శనాలు కల్పించాల్సిన అవసరం లేదని, ఆ అవకాశాలను సామాన్య భక్తులకు కేటాయిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. దేవుడి సన్నిధిలో అందరూ సమానమేననే భావన ఆచరణలో కనిపించాలని కోరారు.

ప్రస్తుతం అమలవుతున్న విధానం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, దీనిని మానవ హక్కుల ఉల్లంఘనగా భావిస్తున్నానని నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి స్పష్టత ఇవ్వాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports