Last Updated:
గుండె జబ్బులు ఉన్నవాళ్లు సినిమాకు రావద్దు అంటూ సరికొత్త హర్రర్ థ్రిల్లర్ అమెన్ మూవీ డైరెక్టర్ ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.
తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త కంటెంట్‌తో మరో హర్రర్ థ్రిల్లర్ రాబోతోంది. అదే ‘అమెన్’ (AMEN). దర్శకుడు, నిర్మాత ఎస్కే బషీద్ నుండి రాబోతున్న మరో విభిన్నమైన చిత్రం ఇది. ఎస్బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై, రేగుల నీరజరాణి సమర్పణలో, ఆర్ఎన్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
అభిరుచిగల దర్శకుడు, నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఎస్కే బషీద్ పలు భాషల్లో విజయవంతమైన చిత్రాలను అందించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అంచనాలకు అందని అనూహ్యమైన సబ్జెక్టులతో ప్రయోగాలు చేసే బషీద్.. ఇప్పుడు ‘అమెన్’ మూవీతో మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఈ సినిమాకు రావద్దు అంటూ సంచలన ప్రకటన చేయడంతో ఒక్కసారిగా ఈ మూవీ హాట్ టాపిక్ అయింది.
“ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాల ట్రెండ్‌ను పూర్తిగా మార్చేలా ‘అమెన్’ రూపొందించాం. సరికొత్త సస్పెన్స్, భయానక ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాం. కొత్త నటీనటులతో టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఎంత భయపెడుతుందో చెప్పలేం… గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్‌కు రావద్దు. ఒంటరిగా కూర్చుని చూసే ధైర్యం ఎవరికీ ఉండదు. ఇది కుటుంబ సమేతంగా థియేటర్లలో ఆస్వాదించాల్సిన ఒక భయానక అనుభవం ఔట్‌పుట్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఈ చిత్రాన్ని మేమే స్వయంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం” అని దర్శకుడు, నిర్మాత ఎస్కే బషీద్ అన్నారు.
ఇటీవల విడుదలైన ‘అమెన్’ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “హెచ్చరిక: మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా ఇంట్లో ఉంచి సినిమాకు రండి…” అనే క్యాప్షన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. క్రూసేడర్ థీమ్, నీటిలో నుంచి వెలువడుతున్న భయానక హస్తాలు, మిస్టరీతో నిండిన విజువల్స్ హారర్ ప్రేమికులను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. సో, టాలీవుడ్లో కొత్త హారర్ వేవ్‌ను సృష్టించేందుకు సిద్ధమైన ‘అమెన్’ జూలై 24న థియేటర్లలో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో అనే ఆసక్తి నెలకొంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














