తెలుగు బుల్లితెర చరిత్రలో అత్యంత విజయవంతమైన కామెడీ షోలలో జబర్దస్త్ ఒకటి. 2013లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎంతో మంది కొత్త కళాకారులను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ వేదికపై మెరిసిన పలువురు ఆర్టిస్టులు తర్వాత సినీ పరిశ్రమలో హీరోలు, కమెడియన్లు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శీను, రాకింగ్ రాకేష్, ఆటో రామ్ ప్రసాద్, వేణు, అదిరే అభి, ధన్‌రాజ్, చమ్మక్ చంద్ర వంటి ఎన్నో మంది ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చారు.














