అర్హులైన నిరుపేద కుటుంబాలు మీసేవ కేంద్రాల ద్వారా లేదా వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం సులభతరమైన అవకాశం కల్పించింది. దరఖాస్తు సమయంలో నాన్-రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కింద రూ. 100 చెల్లించాలి. అలాగే, ఈఎండీ (టోకెన్ అడ్వాన్స్) కింద రూ. 10,000 చెల్లించడం తప్పనిసరి. ఒకవేళ లాటరీ పద్ధతిలో ఇల్లు రాకపోతే ఈ పది వేల రూపాయలను లబ్ధిదారులకు తిరిగి చెల్లిస్తారు. దరఖాస్తు సమర్పణ, పత్రాల పరిశీలన, లాటరీ, కేటాయింపు, రిజిస్ట్రేషన్ అనే పారదర్శక దశల్లో ఈ ప్రక్రియ మొత్తం ముగుస్తుంది.














