రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఇతిహాస చిత్రంలో తొలి భాగం (పార్ట్-1) ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఇటీవల ‘ప్రథమ్ సంకల్ప్’ (Pratham Sankalp) పేరుతో ఒక ప్రత్యేక ప్రచార చిత్రాన్ని ప్రదర్శించారు. రామాయణ ప్రపంచాన్ని పరిచయం చేసే ఈ అద్భుతమైన ట్రైలర్ జులై 24న ప్రేక్షకులందరికీ అధికారికంగా అందుబాటులోకి రానుంది.
వాల్మీకి రామాయణంలో ప్రతి పాత్రకు ఒక విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఈ భారీ మల్టీస్టారర్‌లో ఎవరెవరు ఏ పాత్రలు పోషిస్తున్నారనే దానిపై సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. దక్షిణాది, ఉత్తరాది తారల కలయికతో ప్యాన్ ఇండియా స్థాయిలో సిద్ధమవుతున్న ఈ చిత్ర పూర్తి తారాగణం వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాముడు: బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్
సీతాదేవి: న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి
దశరథ మహారాజు: అరుణ్ గోవిల్ (గతంలో రామానంద్ సాగర్ రామాయణంలో రాముడిగా నటించిన వీరు ఇప్పుడు దశరథుడిగా కనిపించనున్నారు)
లక్ష్మణుడు: రవి దూబే
భరతుడు: ఆదినాథ్ కొఠారే
శతృఘ్నుడు: నితీశ్ శర్మ
కౌసల్య: ఇందిరా కృష్ణన్
కైకేయి: లారాదత్త
సుమిత్ర: సోనల్ ఝా
మంధర: సీబా చద్దా
వశిష్ఠ మహర్షి: శిశిర్ శర్మ
విశ్వామిత్రుడు: అజింక్య దేవ్
రావణాసురుడు: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (పార్ట్-1లో తక్కువ నిడివి ఉన్నప్పటికీ, పార్ట్-2లో రామ-రావణ యుద్ధం అత్యంత కీలకం కానుంది)
కైకసి (రావణుడి తల్లి): సీనియర్ నటి శోభన
మండోదరి (రావణుడి భార్య): కాజల్ అగర్వాల్
శూర్పణఖ: రకుల్ ప్రీత్ సింగ్
విద్యుత్జిహ్వుడు (శూర్పణఖ భర్త): వివేక్ ఒబెరాయ్
విభీషణుడు: హరీశ్ ఉత్తమన్
కుంభకర్ణుడు: ఫైసల్ మాలిక్
హనుమంతుడు: బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ దేవోల్
జటాయువు (వాయిస్ ఓవర్): అనుపమ్ ఖేర్ (గతంలో అమితాబ్ బచ్చన్ పేరు వినిపించినా, తుది ఎంపిక అనుపమ్ ఖేర్ అని సమాచారం)
ఇంద్రుడు: కునాల్ కపూర్
అగస్త్య మహాముని: ముకేశ్ తివారి
మారీచుడు: సౌరబ్ సచ్దేవ్
తాటకి: కాంచన్ చేతన్
ఆస్కార్ విజేత ‘డీఎన్ఈజీ’ (DNEG) సంస్థ అధినేత నమిత్ మల్హోత్రా నిర్మాణ సారథ్యంలో, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా రూపొందుతోంది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా దేశంలోని అగ్ర తారలందరూ ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో ‘రామాయణ’ భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.













