ACB Raids Transco DE | మాదాపూర్లో ఏసీబీ దాడులు! ట్రాన్స్కో డీఈ ఇంట్లో రూ.15 కోట్ల అక్రమాస్తులు! | ACTPnews

ACB Raids Transco DE | మాదాపూర్లో ఏసీబీ దాడులు! ట్రాన్స్కో డీఈ ఇంట్లో రూ.15 కోట్ల అక్రమాస్తులు!



హైదరాబాద్లోని మాదాపూర్లో ట్రాన్స్కో డివిజనల్ ఇంజనీర్ (DE) ముత్యం వెంకటరమణపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఆయన నివాసంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే రూ.15 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఇందులో 4 లగ్జరీ ఇళ్లు, ఒక బ్యాంక్ లాకర్, రూ.1 కోటి విలువైన కిలో బంగారం ఆభరణాలు, 4 లగ్జరీ వాహనాలకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏసీబీ సోదాల తాజా అప్డేట్స్ ఈ వీడియోలో చూడండి!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *