Nandamuri Balakrishna: బాలకృష్ణ మోకాలి సర్జరీ సక్సెస్.. 3 గంటలు శ్రమించిన వైద్యులు.. ఆ సినిమాల షూటింగ్‌లకు బ్రేక్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

బాలకృష్ణకు ఏఐజీ ఆసుపత్రిలో మోకాలి శస్త్రచికిత్స విజయవంతం. ఆరోగ్యం నిలకడగా ఉంది, కొద్ది రోజులు విశ్రాంతి అవసరం. షూటింగ్‌లు వాయిదా.

News18
News18

కాకినాడలో ‘ఎన్‌బీకే 111’ షూటింగ్ సమయంలో గాయపడిన నందమూరి బాలకృష్ణకు హైదరాబాద్‌లోని ఏఐజీ (AIG) ఆసుపత్రిలో మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. ఏఐజీ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గౌతమ్ చౌదరి నేతృత్వంలో సుమారు మూడు గంటల పాటు ఈ శస్త్రచికిత్స కొనసాగింది. తొడ కండరాలను, మోకాలి చిప్పకు కలిపే ప్రధాన స్నాయువు (క్వాడ్రిసెప్స్ టెండన్) దెబ్బతిన్నట్లు ఆపరేషన్‌లో వైద్యులు గుర్తించారు. దీనికి తోడు మోకాలికి ఇరువైపులా ఉన్న కణజాలం కూడా చిరిగిపోయింది.

సర్జరీ సమయంలో గాయం చుట్టూ పేరుకుపోయిన రక్తాన్ని పూర్తిగా తొలగించి, దెబ్బతిన్న స్నాయువులను మోకాలి చిప్పకు తిరిగి అతికించారు. అదనపు భద్రత కోసం చుట్టుపక్కల ఉన్న కణజాలాలను సైతం అత్యంత జాగ్రత్తగా సరిచేసి బలోపేతం చేశారు. సర్జరీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగిందని డాక్టర్ గౌతమ్ చౌదరి వెల్లడించారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, పోస్ట్-ఆపరేటివ్ పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత క్రమంగా రిహాబిలిటేషన్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

కొరటాల ప్రాజెక్టుపై ప్రభావం..

బాలకృష్ణకు సర్జరీ జరగడంతో డాక్టర్లు ఆయనకు కనీసం నాలుగైదు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ‘ఎన్‌బీకే 111’ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. విలన్‌గా నటిస్తున్న మంచు మనోజ్‌తో భారీ యాక్షన్ సీన్స్ తీస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో, ఆ యాక్షన్ షెడ్యూల్ మొత్తం వాయిదా పడింది.

మరోవైపు, ఈ సినిమా పూర్తయిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య ఒక భారీ ప్రాజెక్టు చేయాల్సి ఉంది. తాజా గాయం, సర్జరీ విశ్రాంతి సమయం కారణంగా గోపీచంద్ మలినేని సినిమాతో పాటు భవిష్యత్తులో పట్టాలెక్కాల్సిన కొరటాల శివ ప్రాజెక్టు షూటింగ్ షెడ్యూల్స్ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports