Prabhas: స్పిరిట్‌పై పిచ్చెక్కిపోయే అప్‌డేట్.. ప్లానింగ్ అంటే నీదయ్యా సందీప్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న భారీ సినిమా స్పిరిట్ పై పిచ్చెక్కిపోయే న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది.

News18
News18

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు వస్తున్న అప్‌డేట్‌లు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ భాగం కానుందనే వార్త తాజాగా టాలీవుడ్ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, సాలార్ 2 వంటి పలు పెద్ద చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీటిలో, యానిమల్ విజయం తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన స్పిరిట్ చిత్రంపై సినీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ మొదలైనప్పటి నుంచే ఈ సినిమాపై ఇప్పటికే చాలా హైప్ నెలకొంది. భారీ తారాగణంతో ‘స్పిరిట్’ తెరకెక్కిస్తున్న సందీప్ రెడ్డి వంగా, ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌ను సంప్రదించినట్లు సమాచారం.

స్పిరిట్ చిత్రంలో హీరోయిన్ గా తృప్తి దిమ్రి పేరును చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. కాబట్టి, ఈ చిత్రంలో కత్రినా కైఫ్ కనిపిస్తే, అది విభిన్నమైన, ముఖ్యమైన పాత్ర అవుతుందని అంటున్నారు. మరోవైపు, ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నారని సమాచారం.

‘స్పిరిట్’ సినిమా షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయిందని ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలిపారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ ‘స్పిరిట్’ చిత్రాన్ని 2027 మార్చిలో థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా విలక్షణమైన దర్శకత్వం, బలమైన తారాగణంతో ‘స్పిరిట్’ ఇప్పటికే భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, అభిమానులలో ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed