Chennai Love Story Twitter Review: చెన్నై లవ్ స్టోరీ ట్విట్టర్ రివ్యూ.. ఇందేందిరా మావ, సినిమా చూసినోళ్లు ఇలా అంటున్నారు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన కొత్త సినిమా చెన్నై లవ్ స్టోరీ. సాయి రాజేష్ కథ అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ రోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది, ట్విట్టర్ టాక్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.

News18
News18

స్ట్రాంగ్ కంటెంట్ తో, యూత్ ఆడియన్స్ టార్గెట్ గా “చెన్నై లవ్ స్టోరీ” సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించగా, శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటించింది. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. సాయి రాజేష్ కథ అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు. నేడు జూలై 24న “చెన్నై లవ్ స్టోరీ” సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ తమ ఫీలింగ్స్ బయటపెడుతున్నారు.

చెన్నై లవ్ స్టోరీ యూత్ కనెక్ట్ అయ్యే సినిమా అని చెబుతున్న ఆడియన్స్.. సినిమా ఫస్టాఫ్ ఓకే కానీ సెకండాఫ్ బోర్ కొట్టించారని అంటున్నారు. మణిశర్మ సంగీతంతో పాటు హీరోహీరోయిన్ల యాక్టింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయని, ఎమోషనల్ సీన్స్ బాగా పండిచారని అంటున్నారు.

ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ.. చెన్నై లవ్ స్టోరీ ఒక సరికొత్త మలుపుతో సాగే ప్రేమకథ. ఆ మలుపే ఈ సినిమాకి ప్రధాన బలం. మధ్యలో కాస్త నెమ్మదించినప్పటికీ, ఫస్ట్ హాఫ్ చాలా కూల్‌గా, తేలికగా సాగిపోతుంది. అయితే ప్రీ-ఇంటర్వెల్, ఎమోషనల్ ఇంటర్వెల్ సన్నివేశాలతో సినిమా మళ్లీ గాడిలో పడుతుంది.

కానీ అసలు సమస్య అంతా సెకండ్ హాఫ్‌లోనే ఉంది, ఎందుకంటే ప్రేక్షకులకు ఏమాత్రం కనెక్ట్ కాని ఎమోషన్స్ తో సెకండాఫ్ నింపేశారు. ప్రధాన కథాంశంలో ఎమోషనల్ క్లైమాక్స్‌కి దారితీసే అన్ని అంశాలు ఉన్నప్పటికీ, చివర్లో ఆశించిన ఇంపాక్ట్ (పంచ్) ఇవ్వడంలో అవన్నీ సరిగ్గా కుదరలేదు. దీంతో సినిమా చివరకు బోరింగ్‌గా మారుతుంది. గౌరి తన పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోయింది, ఇక కిరణ్ తన నటనతో ట్రాక్‌కి మెచ్యూరిటీ, బ్యాలెన్స్ తీసుకొచ్చాడు. ఒకసారి చూడొచ్చు. అనే ట్వీట్స్ అయితే కనిపిస్తున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed