Last Updated:
రీసెంట్ గా వచ్చిన ‘జన నాయగన్’ సినిమాతో హీరో విజయ్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఆయన ఖాతాలో హ్యాట్రిక్ సక్సెస్ పడింది. ఆ వివరాలు చూద్దాం..
విజయ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జన నాయగన్’ (Jana Nayagan) బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్రీసేల్‌లో ఏకంగా 10 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది. దీంతో విజయ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు పడింది. వరుసగా మూడు సినిమాలకు ప్రీసేల్ బుకింగ్స్‌లో 1 మిలియన్ మార్క్ అందుకున్న హీరోగా రికార్డు సృష్టిచాడు. అంతేకాదు ఈ ఫీట్ అందుకున్న తొలి భారతీయ హీరోగా విజయ్ నిలవడం విశేషం. విజయ్ గత సినిమాలు ‘వారిసు’, ‘ది గోట్’ లకు కూడా విడుదలకు ముందే 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవగా.. ఇప్పుడు ‘జన నాయగన్’తో హ్యాట్రిక్ కొట్టారు విజయ్.
ఈ సినిమా జులై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఎన్నికలకు ముందే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హెచ్. వినోత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. మమితా బైజు కీలక పాత్రలో నటించింది. బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ విలన్లుగా నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ సినిమా, తెలుగు హిట్ ‘భగవంత్ కేసరి’ కథను ఆధారంగా కొన్ని మార్పులు చేర్పులతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
కథ విషయానికి వస్తే.. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన విజ్జి అలియాస్ మమితా బైజును దళపతి వెట్రి కొండన్ అలియాస్ విజయ్ దళపతి ఎంతో ప్రేమగా పెంచుతాడు. ఆమెను ఆర్మీ అధికారిగా చూడాలని కలలు కంటాడు. కానీ విజ్జి భయాలతో పాటు మానసిక సమస్యల కారణంగా ఆ దిశగా వెళ్లడానికి ఆసక్తి చూపదు. ఇదే సమయంలో జాన్ హిమ్లర్ అలియాస్ బాబీ డియోల్ అనే ప్రమాదకర వ్యక్తి, రాజకీయ నాయకుడు రోజా రంగసామి అలియాస్ ప్రకాష్ రాజ్‌తో కలిసి దేశంలో మత ఘర్షణలు రేపి అల్లకల్లోలం సృష్టించే కుట్ర పన్నుతాడు. ఈ కుట్రను దళపతి ఎలా అడ్డుకున్నాడు? విజ్జిలోని భయాన్ని ఎలా పోగొట్టాడు? అన్నదే సినిమా ప్రధాన కథ.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jul 25, 2026 12:34 PM IST














