Kothi Kommachi Shooting: వైజాగ్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘కోతి కొమ్మచ్చి’ ! | | ACTPnews

Kothi Kommachi Shooting: వైజాగ్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'కోతి కొమ్మచ్చి' ! |


Last Updated:

Satish Vegesna Kothi Kommachi: శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న సతీష్ వేగేశ్న చాలా రోజుల తర్వాత మళ్లీ కామెడీ ట్రాక్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్నలు హీరోలుగా తెరకెక్కుతున్న..

శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న సతీష్ వేగేశ్న చాలా రోజుల తర్వాత మళ్లీ కామెడీ ట్రాక్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్నలు హీరోలుగా తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘కోతి కొమ్మచ్చి’ షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతుంది. ఇటీవలే అమలాపురంలో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్, సాంగ్స్ షూట్ చేసిన యూనిట్ ప్రస్తుతం వైజాగ్ లో హీరోలు మేఘాంశ్ , సమీర్ హీరోయిన్స్ రిద్ది కుమార్, మేఘా చౌదరి లపై సన్నివేశాలు తీస్తున్నారు. సింగిల్ షెడ్యూల్ లో ఒక సాంగ్ మినహా టోటల్ షూట్ పూర్తి చేయబోతున్నారు. అందుకే ఎలాంటి బ్రేక్ లేకుండా షూట్ చేస్తున్నారు. అమలాపురంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ బాగా ఆకట్టుకుంటాయని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports