కొత్త తరానికి సరికొత్త ప్రొడక్షన్ హబ్‌‌గా బల్గేరియా.. సినీ నిర్మాతలకు స్పెషల్ బెనిఫిట్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

యూరోపియన్ దేశమైన బల్గేరియా మన సినీ నిర్మాతలకు సరికొత్త ప్రొడక్షన్ హబ్‌గా మారుతోంది. కేవలం అందమైన లొకేషన్లకే పరిమితం కాకుండా, అత్యంత తక్కువ నిర్మాణ వ్యయం, ఆర్థిక రాయితీలు, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో యూరప్‌లో ప్రధాన షూటింగ్ కేంద్రంగా ఎదిగేందుకు ఆ దేశం ప్రత్యేకంగా సన్నద్ధమవుతోంది.

News18
News18

ప్రపంచవ్యాప్తంగా భారతీయ చలనచిత్రాల మార్కెట్ అఖండంగా విస్తరిస్తున్న తరుణంలో, యూరోపియన్ దేశమైన బల్గేరియా మన సినీ నిర్మాతలకు సరికొత్త ప్రొడక్షన్ హబ్‌గా మారుతోంది. కేవలం అందమైన లొకేషన్లకే పరిమితం కాకుండా, అత్యంత తక్కువ నిర్మాణ వ్యయం, ఆర్థిక రాయితీలు, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో యూరప్‌లో ప్రధాన షూటింగ్ కేంద్రంగా ఎదిగేందుకు ఆ దేశం ప్రత్యేకంగా సన్నద్ధమవుతోంది.

‘ఆర్ఆర్ఆర్’ ప్రొడ్యూసర్ జుజి ప్రత్యేక చొరవఈ అద్భుతమైన అవకాశాన్ని భారతీయ మేకర్స్‌కు చేరువ చేసే కార్యక్రమానికి టీఎల్ ప్రొడక్షన్ (TL Production) అధినేత టోడర్ లాజరోవ్ జుజి (Todor Lazarov Juzi) ముందుండి నాయకత్వం వహిస్తున్నారు. దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) బల్గేరియా షెడ్యూల్‌కు ఆయన లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. టాలీవుడ్‌లో RRR తో పాటు ‘హరి హర వీర మల్లు’, ‘దాస్ కా దమ్కీ’, పాన్ ఇండియా హిట్స్ ‘కాంతార’, ‘ఛావా’ వంటి భారీ చిత్రాలకు జుజి యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. బల్గేరియా కేవలం ఒక సుందరమైన లొకేషన్ మాత్రమే కాదని, ప్రీ-ప్రొడక్షన్ నుంచి పోస్ట్-ప్రొడక్షన్ వరకు ఒక సినిమాకు అవసరమైన పూర్తిస్థాయి సాంకేతిక సహకారాన్ని అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

బల్గేరియా అందిస్తున్న ప్రత్యేక ప్రయోజనాలు:

ఆర్థిక ప్రోత్సాహకాలు: బల్గేరియాలో చిత్ర నిర్మాణ వ్యయం ఇతర యూరోపియన్ దేశాల కంటే చాలా తక్కువ. అర్హత ఉన్న ప్రాజెక్టులకు 25 శాతం వరకు క్యాష్ రిబేట్ (Cash Rebate) లభిస్తుంది. అలాగే, ఇక్కడ వ్యక్తిగత, కార్పొరేట్ పన్ను విధానం (ఫ్లాట్ టాక్స్) కేవలం 10 శాతం మాత్రమే కావడం చిత్ర నిర్మాతలకు పెద్ద ఊరట.

లొకేషన్లు – ప్రపంచస్థాయి స్టూడియోలు: హాలీవుడ్ చిత్రాలకు ఆతిథ్యం ఇచ్చిన ప్రఖ్యాత ‘ను బొయానా ఫిల్మ్ స్టూడియోస్’ (Nu Boyana Film Studios) వంటి ఇంటర్నేషనల్ సౌండ్ స్టేజీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దట్టమైన అడవులు, మంచు పర్వతాలు, రోమన్ కాలం నాటి శిథిలాలు, మధ్యయుగపు కోటలు, బ్లాక్ సీ (Black Sea) తీరప్రాంతాలు షూటింగ్‌లకు ప్రత్యేక ఆకర్షణ.

సాంకేతికత: హాలీవుడ్ స్థాయి వీఎఫ్‌ఎక్స్ (VFX), సీజీఐ (CGI), వందలాది ఇంటర్నేషనల్ సినిమాలకు పనిచేసిన అనుభవజ్ఞులైన టెక్నీషియన్లు బల్గేరియా సొంతం.

భారత్‌తో విడదీయరాని బంధం – దర్శకుడిగా జుజియూరప్‌లో సినిమా తీయాలనుకున్న ప్రతి భారతీయ నిర్మాతకు బల్గేరియా మొదటి ఛాయిస్ కావాలని జుజి ఆకాంక్షిస్తున్నారు. “నా సినీ ప్రయాణం బల్గేరియాలో ప్రారంభమైనా.. నా మనసు మాత్రం ఇండియాతో ముడిపడిపోయి ఉంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. గొప్ప కథలకు సరిహద్దులు ఉండవని నమ్ముతాను” అని ఆయన తెలిపారు. ఈ అనుబంధంతోనే, తన స్నేహితుడు ఆశిష్ గణేశన్‌తో కలిసి ‘టాడ్ యాష్ చాప్టర్‌హౌస్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, ఒక ఇండియన్ సూపర్ హీరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా టోడర్ లాజరోవ్ జుజి దర్శకుడిగా పరిచయం కానుండగా, ఇందులోని అత్యంత కీలక భాగాలను బల్గేరియాలోనే చిత్రీకరిస్తున్నారు.

అద్భుతమైన లొకేషన్లు, ఇంటర్నేషనల్ ప్రతిభ, ప్రభుత్వ రాయితీలతో బల్గేరియా త్వరలోనే భారతీయ సినిమాలకు యూరప్‌లో ప్రధాన కేరాఫ్ అడ్రస్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed