Last Updated:
Vande Bharat Sleeper Review: వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణం ఎలా ఉంటుంది..? ఈ స్లీవర్ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన 6 నెలల తర్వాత కూడా దాని ఆధునిక సదుపాయాలు, పరిశుభ్రత, సౌకర్యవంతమైన సదుపాయాలను వివరిస్తూ భూటాన్‌కి చెందిన ఓ బ్లాగర్ ఒక వీడియో ద్వారా అందరితో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Vande Bharat Sleeper Review: గత కొన్నేళ్లుగా భారతీయ రైల్వే వేగంగా ఆధునీకరణ చెందుతోంది. సెమీ-హై-స్పీడ్ రైళ్ల నుంచి మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాల వరకు రైల్వే వ్యవస్థ నిరంతరం కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంటోంది. ‘వందే భారత్’ రైలు ఈ ప్రయత్నాల ఫలితమే. ఇది దేశంలో రైలు ప్రయాణ విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇప్పుడు దీని స్లీపర్ వెర్షన్ కూడా ప్రయాణికుల ఆదరణ పొందుతోంది. సౌకర్యవంతమైన సీట్లు, ఆధునిక ఇంటీరియర్, పరిశుభ్రత, అత్యుత్తమ వసతుల కారణంగా ఈ రైలు భారతీయులనే కాకుండా విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది. తాజాగా భూటాన్‌కు చెందిన ఒక ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణించి సోషల్ మీడియాలో ఒక రివ్యూను పంచుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.న్యూస్18 హిందీ ప్రచూరించిన ఈకథనం ఇప్పుడు చాలా మంది భారతీయ రైల్వే ప్రయాణికులకు వందేభారత్ స్లీవర్ రైలులో ప్రయాణం చేయడం మంచిదేనని సూచిస్తోంది.
భూటాన్‌కు చెందిన ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ అనుష, గౌహతి నుండి కోల్‌కతాకు కామాఖ్య-హౌరా వందే భారత్ స్లీపర్ రైలులో తాను చేసిన ప్రయాణానికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా (@annu.sia)లో షేర్ చేసింది. విశేషమేమిటంటే ఈ రైలు ప్రారంభోత్సవం జరిగిన సుమారు ఆరు నెలల తర్వాత ఆమె దాని స్థితిగతులను పరిశీలించారు. ఆరు నెలల పాటు నిరంతరాయంగా నడిచినందున రైలు పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుందని అనుష భావించింది. అయితే ఆమె లోపలికి అడుగుపెట్టగానే ఆ అభిప్రాయం మారిపోయింది. ట్రైన్‌లో అడుగుపెట్టగానే ఆమెకు టీ అందించారు. ఆ తర్వాత ఆమె మొత్తం కోచ్‌ను పరిశీలించింది. ఆమె చెప్పిన దాని ప్రకారం ‘ఫస్ట్ ఏసీ’ (First AC) క్యాబిన్ విశాలంగా ఆధునికంగా, అత్యంత శుభ్రంగా ఉంది. ఆరు నెలల తర్వాత కూడా ఆ రైలు సరికొత్తగా కనిపించింది.
ఏ రైలైనా దాని అసలైన పరీక్ష బాత్రూంలలోనే ఉంటుందని కామెంట్ చేసింది ట్రావెల్ బ్లాగర్ అనూష. వందేభారత్ స్లీపర్ ట్రైన్‌లో శుభ్రత అంత బాగోదని ఆమె ఊహించింది. కానీ బాత్రూంను ప్రత్యక్షంగా చూసినప్పుడు చాలా ఆకట్టుకుంది. ఫస్ట్ ఏసీ కోచ్‌లో అద్భుతమైన షవర్ సదుపాయం ఉందని, ముఖ్యంగా వాష్‌రూమ్ అంతా అత్యంత శుభ్రంగా ఉందని పేర్కొన్నారు. తన అభిప్రాయం ప్రకారం ఆహార నాణ్యత ప్రారంభ రోజుల్లో ఉన్నట్టే అద్భుతంగా ఉంది. ఆరు నెలల తర్వాత కూడా ‘వందే భారత్ స్లీపర్’ రైలు ప్రయాణ అనుభవం పరంగా (vibe check) అద్భుతంగా నిలిచిందని ఆ వీడియోలో తన అనుభవాన్ని అందరితో షేర్ చేసుకుంది.
ఆ వీడియో వైరల్ అయిన తర్వాత వేలాది మంది స్పందించారు. ఆ విదేశీ కంటెంట్ క్రియేటర్ భారతీయ రైల్వేల గురించి ప్రపంచానికి సానుకూల దృక్పథాన్ని అందించారని చాలా మంది వినియోగదారులు పేర్కొన్నారు. ఒక యూజర్ భారతీయ రైల్వేలు నిరంతరం మెరుగుపడుతున్నాయని రాశారు. అయితే ప్రయాణికులుగా మనం కూడా అందులోని సౌకర్యాలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నారు. మరొక యూజర్ భారతదేశపు ఆధునిక రైళ్లను ప్రపంచానికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అంటూ కామెంట్ పెట్టారు. ఇంకొకరు, “రైల్వే శాఖ అద్భుతమైన సౌకర్యాలను కల్పిస్తోందని వాటిని శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రయాణికులపైనే ఉందని పేర్కొన్నాడు. భారతీయ రైల్వేకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను ప్రజలతో పంచుకున్నందుకు చాలామంది అనుషకు కృతజ్ఞతలు కూడా తెలిపారు.
సుదూర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేలా వందే భారత్ స్లీపర్ రైలును రూపొందించారు. ఇందులో అత్యాధునిక ఏసీ కోచ్‌లు, మెరుగైన సస్పెన్షన్, సౌకర్యవంతమైన బెర్త్‌లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ప్రత్యేక రీడింగ్ లైట్లు వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం ఆధునిక టాయిలెట్లు మరియు వివిధ నూతన సాంకేతికతలు పొందుపరచబడ్డాయి. ఇతర రైళ్లతో పోలిస్తే దీని లోపలి భాగం కూడా మరింత ప్రీమియంగా ఉండేలా రూపొందించబడింది. ఒక విదేశీ ప్రయాణికుడు వందే భారత్ రైలును ప్రశంసించడం ఇది మొదటిసారి కాదు; గతంలో అనేక మంది భారతీయ మరియు అంతర్జాతీయ ట్రావెల్ వ్లాగర్లు దీని ఆధునిక డిజైన్, పరిశుభ్రత, సమయపాలన మరియు సౌకర్యాలను కొనియాడారు.
Hyderabad,Telangana
Jul 27, 2026 11:03 AM IST














