Last Updated:
Illu Illalu Pillalu Serial July 27th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మంచి కథతో కొనసాగుతోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్‌కు ప్రేక్షకులు మామూలుగా అడిక్ట్ అవ్వలేదు.. ఇక అలాంటి ఈ సీరియల్ ఈరోజు జులై 27వ తేదీ సాయంత్రం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో ఇప్పుడే తెలుసుకుందాం..
illu Illalu Pillalu Serial July 27th Episode: ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో… పుట్టింటి వాళ్ళు వచ్చారన్న ఆనందంలో ప్రేమ పొద్దున్నే లేచి హడావుడి చేస్తుంది. వాళ్ల కోసం కూల్ డ్రింక్స్ పట్టుకుని వెళ్తూ.. ధీరజ్, నర్మద మాట్లాడుకుంటున్న చోటికి వచ్చి “తప్పుకోండి” అని కేకలు వేస్తుంది. దీనికి ధీరజ్ స్పందిస్తూ “ఏంటే పొద్దున్నుంచి ఆటోలా తిరుగుతున్నావ్? పీకల దాకా తిన్నారుగా, మళ్లీ ఈ కూల్ డ్రింక్స్ ఏంటి?” అని కౌంటర్లు వేస్తాడు. ప్రేమ కూడా “మా వాళ్లకు దిష్టి పెట్టకురా” అని స్వీట్ వార్నింగ్ ఇస్తుంది. అయితే ప్రేమపై ఉన్న ప్రేమతో ధీరజ్ ఒక బ్యూటిఫుల్ శారీని గిఫ్ట్‌గా ఇచ్చి ఆమెను సర్ ప్రైజ్ చేస్తాడు. సారీ చాలా బాగుంది నువ్వే కొన్నావా అని ప్రేమ అడిగితే.. “లేదే వాడెవడో కొంటే నేను పట్టుకొచ్చా” అని తనదైన శైలిలో కామెంట్ చేస్తాడు. అయితే వీళ్లు విడిపోతారని ఆశగా ఎదురుచూస్తున్న వల్లి మాత్రం గోర్లు కొరుక్కుంటూ మీ సంగతి చెప్తా అన్నట్టు చూస్తుంటుంది…
ఇక మరోవైపు వేదవతి కూడా తన పుట్టింటి వాళ్ళు వచ్చారని పిండివంటలు తయారు చేసి వడ్డించే పనిలో పడుతుంది. కిచెన్ లోకి వెళ్లి అందరి ముందూ “మా వాళ్లకు అది చేయాలి.. ఇది చేయాలి” అని గొప్పలు చెప్పుకుంటుంటే, నర్మద మాత్రం ఎప్పటికప్పుడు ఘాటైన సమాధానాలతో కౌంటర్లు వేస్తూ ఉంటుంది. అంతేకాకుండా, రెండు కుటుంబాలు కలిశాయని ఊరంతా తెలిసేలా ఫోన్ లో స్టేటస్ పెట్టమని వేదవతి అమూల్యకు చెప్తుంది. దానికి నర్మద “ఊర్లో వాళ్ళందరూ ఉండాలిగా మరి ఉన్నారా?” అని అడగడంతో.. “అయ్యో, నా ఫోన్ లో మీ నెంబర్లు తప్ప వేరేవి లేవు కదా” అని వేదవతి సర్దుకుంటుంది.
ఇక భోజనాల దగ్గర సేన మాటలతో గొడవ మొదలు పెడుతాడు… “ముందు మగవాళ్ళు తిననివ్వండి, ఆ తర్వాత మనం ప్రశాంతంగా తిందాం” అని వేదవతి అంటుంది.. దాంతో ఇటు రామరాజు కుటుంబం అటు సేన కుటుంబం భోజనానికి కూర్చుంటారు.. అయితే వాళ్ళు అలా కూర్చున్నప్పటి నుంచీ ప్రశాంతంగా ఉండకుండా ఏదో ఒక మాట అంటూనే ఉంటాడు సేన..
అన్నయ్య వచ్చాడన్న సంతోషంతో వేదవతి మొదట మౌనంగా ఉన్నా.. సేన మాటలు ఎక్కువ అవ్వడంతో షాక్ అవుతుంది. సేన తింటూ తింటూనే రామరాజుని, ఆయన కొడుకులను ఘోరంగా అవమానిస్తాడు. “నువ్వంటే ఏదో ఉద్యోగం చేస్తున్నావ్ ఓకే, కానీ ఈ కూలోళ్లు మాత్రం ఏ పనీ పాట లేకుండా కూలి పనులు చేసుకుంటున్నారు” అని సూరితో హేళనగా మాట్లాడుతాడు.. దానికి కొడుకులు తిరిగి సీరియస్ గా సమాధానం చెప్పబోతే రామరాజు వారించి నా కొడుకులు డిగ్రీలు చేసి నచ్చిన పని చేసుకుంటున్నారు అని అంటాడు.
అంతటితో ఆగకుండా సేన శృతిమించి మాట్లాడుతాడు.. ఒకడు రైస్ మిల్ లో కులోడు.. ఇంకొకడు కారు నడుపుతున్నాడు.. ఇంకొకడు ఊర్లో వాళ్ళ డబ్బు కొట్టేసి పెళ్ళాం నగలు తాకట్టు పెట్టి ఉద్యోగం తెచ్చుకున్నాడు అని హేళన చేస్తాడు.. ఆతర్వాత కూడా ఆగకుండా ప్రేమను ఆస్తి కోసమే ధీరజ్ పెళ్లి చేసుకున్నాడని… అప్పట్లో రామరాజు ఏ పని చేశాడో ధీరజ్ అదే చేశాడని అవమానిస్తాడు. ఈ మాటలకు వేదవతి సీరియస్ అవుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














