Polimera-3 Movie: గ్రాండ్‌గా ‘పొలిమేర-3’ మూవీ లాంఛ్.. ఈ సారి రంగలోకి యాక్షన్ కింగ్ అర్జున్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఆడియెన్స్‌ను పిచ్చిక్కిపోయేలా చేసిన సినిమా’మా ఊరి పొలిమేర’. టాలీవుడ్ నటుడు సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. ఐదేళ్ల క్రితం నేరుగా ఓటీటీలో రిలీజై సంచలనం సృష్టించింది.

News18
News18

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఆడియెన్స్‌ను పిచ్చిక్కిపోయేలా చేసిన సినిమా’మా ఊరి పొలిమేర’. టాలీవుడ్ నటుడు సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. ఐదేళ్ల క్రితం నేరుగా ఓటీటీలో రిలీజై సంచలనం సృష్టించింది. చేతబడుల కాన్సెఫ్ట్ తో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఓటీటీలో వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు .హాట్‌స్టార్‌లో నేరుగా విడుదలై ఈ సినిమా కొన్ని రోజుల పాటు ట్రెండింగ్‌లో ఉంది. ఇక సత్యం రాజేష్‌ నటనైతే వేరే లెవల్‌. అప్పటివరకు కామెడియన్‌గా మెప్పించిన సత్యం రాజేష్‌ ఈ సినిమాతో ప్రతినాయకుడిగా తనలోని విలక్షణ నటనను చూపించాడు.

ఇక ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో సీక్వెల్‌పై ఆటోమేటిగ్‌గా బజ్ క్రియేట్ అయింది. అయితే ఫస్ట్ పార్ట్ నేరుగా ఓటీటీలో రిలీజైనా.. సీక్వెల్ మాత్రం థియేటర్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. సత్యం రాజేశ్‌, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించారు. రెండేళ్ల కిందట పీక్స్ అంచనాలతో రిలీజైన ఈ సినిమా.. మొదటి పార్ట్‌ని మించిన ట్విస్ట్‌లతో ఆడియన్స్‌ని సీట్ ఎడ్జ్‌ను కూర్చోబెట్టింది. అంతేకాదు కమర్షియల్‌గా కూడా సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో పార్టు రాబోతుంది.

డైరెకట్ర్ అనీల్ విశ్వనాథ్ తెరకెక్కిస్తున్న ఈ హార్రర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో మూడో పార్టు మరింత థ్రిల్లింగ్‌గా రాబోతుంది. ఈ సినిమాను నందిపాటి ఎంటర్‌టైనమెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్లపై వంశీ నందిపాటి, జాన్వీ నారంగ్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రెండు బ్యానర్‌ల కలయికతో మరింత పవర్‌ఫుల్‌గా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నేడు సికింద్రాబాద్‌లోని ఓ గణేష్‌ ఆలయంలో సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత, ఎగ్జిబిటర్ నారాయణదాస్ నారంగ్ జయంతి సందర్భంగా చిత్రాన్ని ప్రారంభించడం విశేషంగా నిలిచింది.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తొలి క్లాప్ ఇవ్వగా, సీనియర్ నిర్మాత డి. సురేష్ బాబు కెమెరా స్వీచ్చాన్‌ చేశారు. యంగ్ ప్రొడ్యూసర్ బన్నీవాస్‌, ఎగ్జిబిటర్‌ సదానంద్‌ గౌడ్‌ చిత్ర బౌండెడ్ స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందించి విజయాన్ని ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ నిర్మాత సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు గారు తదితరులు పాల్గొన్నారు.

కాగా.. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలోకి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా రావడంతో ఒక్కసారిగా సినిమాపై హై డబుల్ అయింది. రీసెంట్‌గా ‘బ్లాస్ట్ జోన్’ సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన అర్జున్ ఇప్పుడు మూడో పార్ట్‌లో పవర్ ఫుల్ రోల్ చేయబోతన్నాడు. సత్యం రాజేష్ మరోసారి అభిమానుల ప్రశంసలు అందుకున్న కొమరయ్య పాత్రలో కనిపించనున్నారు. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *