Chiranjeevi: చిరంజీవి నుంచి స్పెషల్ ప్రశంసలు.. శ్రీకాంత్ కొత్త సిరీస్‌పై పీక్స్‌లో అంచనాలు..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

Chiranjeevi: చిరంజీవి నుంచి స్పెషల్ ప్రశంసలు.. శ్రీకాంత్ కొత్త సిరీస్‌పై పీక్స్‌లో అంచనాలు..! | తెలుగు సినిమా వార్తలు


హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. జీ5లో ఇది తన మూడో వెబ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ప్రతి సిరీస్‌లోనూ విభిన్నమైన పాత్రలు చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. జీ5తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, వెబ్ సిరీస్‌లతో పాటు ‘డ్రామా జూనియర్స్’ కార్యక్రమం కూడా చేస్తున్నానని తెలిపారు. సినిమా కంటే వెబ్ ఫిల్మ్‌లో పని చేయడం మరింత కష్టమైనప్పటికీ టీమ్ అందరూ ఎంతో ఆనందంగా పనిచేశారని చెప్పారు. దర్శకుడు ప్రతి అంశాన్ని స్పష్టమైన విజన్‌తో తెరకెక్కించారని ప్రశంసించారు. నిర్మాత రాజ్‌కుమార్ షూటింగ్ మొత్తం ఎంతో సహకరించారని అన్నారు. ఫైనల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత టీమ్ మొత్తం ఎంతో సంతోషించిందని చెప్పారు. ముకేశ్ రిషి గొప్ప నటుడే కాకుండా మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. ప్రతి పాత్రకు కథలో మంచి ప్రాధాన్యం ఉందని, అందరూ అద్భుతంగా నటించారని తెలిపారు. ఈ వెబ్ ఫిల్మ్‌ను మెగాస్టార్ చిరంజీవి కూడా చూసి చాలా బాగుందని అభినందించారని వెల్లడిస్తూ, ప్రేక్షకులంతా జూలై 31న తప్పకుండా వీక్షించాలని కోరారు.

నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ, సీరియస్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అంత సులభం కాదని అన్నారు. అయితే ‘అబ్జెక్షన్ మై లార్డ్’ టీమ్ ఆ సవాల్‌ను విజయవంతంగా పూర్తి చేసిందనే నమ్మకం తనకు ఉందన్నారు. తనకు మంచి పాత్ర ఇచ్చిన జీ తెలుగు టీంకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు ఈ కథను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. షూటింగ్ సమయంలో శ్రీకాంత్ అంకితభావాన్ని దగ్గరగా చూసి చాలా విషయాలు నేర్చుకున్నానని, ఆయన డే అండ్ నైట్ కష్టపడే తీరును ప్రస్తుత తరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

సంగీత దర్శకుడు అరుణ్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్‌లో తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. అందుకే కథకు తగ్గట్టుగా సంగీతాన్ని అందించే అవకాశం దక్కిందని, ఈ అవకాశం కల్పించిన చిత్రబృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నటుడు నారాయణ హరిచంద్ర మాట్లాడుతూ, ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాంత్‌తో కలిసి నటించడం తనకు మంచి అనుభవమని చెప్పారు. దర్శకులు ప్రతి సన్నివేశాన్ని ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారని, ఈ వెబ్ ఫిల్మ్ ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా కూర్చోబెడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

నటి స్నేహాల్ మాట్లాడుతూ, షూటింగ్ మొత్తం ఎంతో ఆనందంగా సాగిందని, సహనటులందరూ మంచి సహకారం అందించారని తెలిపారు. మరో నటి అనన్య మాట్లాడుతూ, స్క్రిప్ట్ చదివిన వెంటనే ఇందులో నటించాలనే ఆసక్తి కలిగిందన్నారు. షూటింగ్ సమయంలో తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ దర్శకులు సంతోష్, సూర్య ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ అందరికీ అండగా నిలిచారని చెప్పారు.

నటుడు సమీర్ మాట్లాడుతూ, ఇది సాధారణ వెబ్ సిరీస్ కాదని, పూర్తి స్థాయి వెబ్ ఫిల్మ్ అని పేర్కొన్నారు. ఎంతో భారీ స్థాయిలో నిర్మాణ విలువలతో రూపొందించారని చెప్పారు. శ్రీకాంత్ లాంటి అంకితభావం ఉన్న హీరో లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంత త్వరగా పూర్తయ్యేది కాదన్నారు. ఆయన నిర్మాతల హీరో, దర్శకుల నటుడని కొనియాడారు. జూలై 31న ప్రేక్షకులు అద్భుతమైన విజువల్ ఫీస్ట్‌ను చూడబోతున్నారని అన్నారు.

నిర్మాత రాజ్‌కుమార్ ఆకెళ్ల మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్‌కు జీ5 టీమ్ అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వెబ్ ఫిల్మ్‌కు ప్రధాన బలం శ్రీకాంత్ అని చెప్పారు. ముకేశ్ రిషి, అనన్యతో పాటు ప్రతి నటుడు అద్భుతంగా నటించారని, ఇలాంటి ప్రతిభావంతులైన టీమ్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.

దర్శకుడు సంతోష్ అయ్యప్పన్ మాట్లాడుతూ, ఈ అవకాశం ఇచ్చిన జీ5 టీంకు ధన్యవాదాలు తెలిపారు. కేవలం 19 రోజుల్లో మొత్తం షూటింగ్ పూర్తి చేయడం వెనుక నిర్మాత రాజ్‌కుమార్, సూర్యల సహకారం ఎంతో కీలకమని చెప్పారు. శ్రీకాంత్, ముకేశ్ రిషి, అనన్య, జెమినీ సురేష్ సహా ప్రతి నటుడు ఎంతో అంకితభావంతో పనిచేశారని అన్నారు. సాంకేతిక బృందం కూడా అహర్నిశలు శ్రమించిందని, అందుకే ఈ ప్రాజెక్ట్ అత్యుత్తమంగా వచ్చిందని తెలిపారు. ఈ వెబ్ ఫిల్మ్ తప్పకుండా విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

సీనియర్ నటుడు ముకేశ్ రిషి మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులు తనను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారని అన్నారు. జీ5, నిర్మాత రాజ్‌కుమార్, సూర్యలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం శ్రీకాంత్ రోజుకు 18 గంటల పాటు కష్టపడి పనిచేశారని చెప్పారు. జూలై 31న కుటుంబ సభ్యులతో కలిసి ఈ వెబ్ ఫిల్మ్‌ను చూసి ఆస్వాదించాలని ప్రేక్షకులను కోరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed