ఈ పాము కాటుకు గురి కాకుండా ఉండాలంటే వాటిని నివాస పరిసరాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రాత్రిపూట నేల మీద కాకుండా మంచం మీద పడుకోవడం, అటుఇటు తిరిగేటప్పుడు టార్చ్‌లైట్ ఉపయోగించడం, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఎలుకల సంఖ్యను తగ్గించడం వంటి జాగ్రత్తలు కూడా ఆయన సూచించారు. పాము కాటు వేసినంత మాత్రాన తప్పక మరణం సంభవిస్తుందనేమీ లేదు. అవగాహన, సకాలంలో ఆసుపత్రిలో చికిత్స, శాస్త్రీయ వైద్య విధానాలు ప్రాణాలను కాపాడటంలో అత్యంత ప్రభావవంతమైన మార్గాలు.














