Last Updated: Jul 30, 2026, 19:53 IST
దుల్కర్ సల్మాన్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో రాబోతున్న ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ (I’m Game Movie). ఈ సినిమాలో ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 20న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను ఎన్టీఆర్ విడుదల చేసి, దుల్కర్ సల్మాన్‌తో పాటు, చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ వీడియోలో విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సీక్వెన్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి.













