Spider Man Movie: ‘స్పైడర్ మ్యాన్’ సినిమాకు మెంటల్ మాస్ కలెక్షన్లు.. వామ్మో 4 రోజుల్లోనే అన్ని వేల కోట్లు వచ్చాయా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. టామ్ హాలెండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ రిలీజైన ఫస్ట్ వీకెండ్‌లోనే బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తుంది.

News18
News18

హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. టామ్ హాలెండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ రిలీజైన ఫస్ట్ వీకెండ్‌లోనే బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తుంది. పేయిడ్ ప్రీమియర్లతో జూలై 29న రిలీజైన ఈ సినిమా బీభత్సమైన వసూళ్లు సాధిస్తూ.. ఇండియన్ బాక్సాఫీస్‌పై విరుచుకపడుతుంది. ఏ సెంటర్, బీ సెంటర్ అని తేడా లేకుండా ప్రతీ చోట బీభత్సం సృష్టిస్తుంది. అసలు స్పైడర్ మ్యాన్ ఫీవర్ ఏ రేంజ్‌లో ఉందంటే.. కేవలం 4 రోజుల్లోనే ఇండియాలో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఊచకోత రికార్డులు సృష్టిస్తుంది.

తాజా వివరాల ప్రకారం, ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 927 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.8,830 కోట్లు) వసూలు చేసింది. దీంతో ప్రపంచ సినిమా చరిత్రలోనే రెండో అతిపెద్ద గ్లోబల్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ జాబితాలో ఇప్పటికీ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మొదటి స్థానంలో కొనసాగుతోంది. 2019లో విడుదలైన ఆ చిత్రం తొలి దశలోనే 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.11 వేల కోట్లు) వసూలు చేసి ఇప్పటికీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

సుమారు 225 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,100 కోట్లు) భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ విడుదలైన మొదటి వీకెండ్‌లోనే తన నిర్మాణ వ్యయాన్ని దాటేయడం విశేషం. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎఫెక్ట్స్, భావోద్వేగాలతో కూడిన కథ, టామ్ హాలెండ్ నటన ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో 38వ చిత్రంగా వచ్చిన ఈ సినిమా భారత్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.310 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. తెలుగు, హిందీ, తమిళం సహా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి భారతీయ ప్రేక్షకుల నుంచి కూడా విశేష ఆదరణ లభిస్తోంది.

ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానున్న మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాంటి సమయంలో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో మార్వెల్ అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఈ సినిమా త్వరలోనే 1 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్వెల్‌కు మరో భారీ విజయాన్ని అందించిన చిత్రంగా ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఇప్పటికే తన ముద్ర వేసింది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports