Missing Meghana: సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘మిస్సింగ్ మేఘన’.. ఫస్ట్ లుక్ మాములుగా లేదుగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

News18
News18

ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. వాచస్పతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ కార్తీక్ హీరోగా నటిస్తుండగా, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఆర్.ఆర్. ధృవన్ సంగీతాన్ని సమకూర్చారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఆవిష్కరించడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు నిర్మాత బెక్కం వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.

ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా మాట్లాడిన వి.వి. వినాయక్.. కొత్త దర్శకుడు వాచస్పతికి శుభాకాంక్షలు తెలిపారు. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. హీరో రామ్ కార్తీక్‌కు ఈ చిత్రం కెరీర్‌లో మరో మంచి మైలురాయిగా నిలవాలని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ ప్రతిభావంతుడైన సంగీతకారుడని, పాటలు రాయడంతో పాటు సంగీతం అందించే బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రశంసించారు. ఈ సినిమా ద్వారా ధృవన్‌కు మరింత గుర్తింపు రావాలని, మొత్తం చిత్రబృందానికి ప్రేక్షకుల ఆదరణ లభించాలని ఆయన ఆకాంక్షించారు.

దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ.. వి.వి. వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా తమ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది తమకు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పారు. ‘మిస్సింగ్ మేఘన’ ఒక పూర్తి స్థాయి సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని, ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా కూర్చోబెట్టే అంశాలు ఇందులో ఉంటాయని వెల్లడించారు. థ్రిల్, ఎమోషన్, ట్విస్టులతో కూడిన కథను సిద్ధం చేశామని, త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలిపారు. మీడియా ఎప్పటిలాగే తమ చిత్రానికి సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని కల్పించిన దర్శకుడు వాచస్పతి, నిర్మాత పంచుమర్తి నరేష్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ సినిమా పోస్టర్‌ను విడుదల చేసిన వి.వి. వినాయక్‌కు ధన్యవాదాలు చెప్పారు. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను ఆదరిస్తారని, ప్రతి ఒక్కరికీ నచ్చే విధంగా చిత్రం రూపొందిందనే నమ్మకం ఉందన్నారు.

సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ మాట్లాడుతూ.. లెజెండరీ దర్శకుడు వి.వి. వినాయక్ చేతుల మీదుగా పోస్టర్ విడుదల కావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఒక సంగీత దర్శకుడిగా తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఈ చిత్రం ఇచ్చిందని తెలిపారు. కథలో ఉన్న సస్పెన్స్, భావోద్వేగాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు తగ్గట్టుగా సంగీతాన్ని రూపొందించామని చెప్పారు. ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని, తమ మొత్తం టీమ్‌కు ప్రేక్షకులు ఆశీస్సులు, ఆదరణ అందించాలని కోరారు. ఫస్ట్ లుక్‌తోనే ఆసక్తి పెంచిన ‘మిస్సింగ్ మేఘన’ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చి థ్రిల్లర్ ప్రేమికులకు కొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed