Last Updated:
నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). బ్లాక్‌బస్టర్ హిట్ ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ టీజర్‌ను చిత్ర బృందం గ్రాండ్‌గా విడుదల చేసింది.














