Last Updated:
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణలపై అమెరికా ఎంపీ చేసిన వ్యాఖ్యలకు భారత్ తీవ్రంగా బదులిచ్చింది. చట్టాల రూపకల్పన తమ అంతర్గత విషయమని, విదేశీ నిధుల నియంత్రణ అమెరికాలోనూ ఉందంటూ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లుపై అమెరికా ఎంపీ చేసిన విమర్శలపై భారతదేశం తీవ్రంగా స్పందించింది. చట్టాలకు సంబంధించిన అంశాలు పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని, దేశ పార్లమెంట్ పరిధిలోనే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్‌లో చట్టాలను రూపొందించడానికి ఒక బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చే నిధులను నియంత్రించే చట్టాలు ఒక్క భారతదేశంలోనే కాదు, అమెరికా సహా చాలా దేశాల్లో అమల్లో ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశీయ చట్టాలను సరైన కోణంలో అర్థం చేసుకోవాలని సూచించారు. విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికే కేంద్ర ప్రభుత్వం ఈ సవరణలు తెస్తోందని ఆయన వెల్లడించారు.














