ఈవో (Evo) అనేది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అయినప్పటికీ, ఇది చాట్‌జీపీటీ లాగా అక్షరాలు లేదా పదాలను విశ్లేషించదు. బదులుగా ఇది జీవుల డీఎన్ఏ (DNA) ప్యాటర్న్స్‌ను, జన్యుక్రమాలను అర్థం చేసుకుంటుంది. దీనికి లక్షల కొద్దీ బ్యాక్టీరియోఫేజ్‌ల (Bacteriophages) జన్యుక్రమాలు, సుమారు 300 బిలియన్ల న్యూక్లియోటైడ్‌లపై శిక్షణ ఇచ్చారని ‘ఫైనాన్షియల్ టైమ్స్’ తెలిపింది. దీని ఆధారంగా ఈ మోడల్.. కొత్త జన్యువులను స్వయంగా డిజైన్ చేయగలదు. జీవశాస్త్రంలో కేవలం ప్రోటీన్లను విశ్లేషించే స్థాయి నుంచి, ఏకంగా ఒక ఫంక్షనల్ వైరస్ జీనోమ్‌ను సృష్టించే స్థాయికి ఏఐ చేరుకోవడం ఇదే తొలిసారని ఎకనామిక్ టైమ్స్ వివరించింది.













