Last Updated:
రేణుకాస్వామి హత్య కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే సంచలనం సృష్టించిన ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో 14వ నిందితుడిగా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్.. అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించారు.
రేణుకాస్వామి హత్య కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే సంచలనం సృష్టించిన ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో 14వ నిందితుడిగా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్.. అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు.. ఘటనకు ముందు, హత్య జరిగిన సమయంలో, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై తనకు తెలిసిన విషయాలను పిటిషన్‌లో వెల్లడించినట్లు సమాచారం. ప్రదోష్ వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలు కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.














