Asian Games 2026: కబడ్డీలో మెరిసిన భారత్.. పసిడి కూతతో అదరగొట్టిన అమ్మాయిలు | క్రీడా వార్తలు | ACTPnews

PC: X.com


Last Updated:

Asian Games 2026: జపాన్ వేదికగా అట్టహాసంగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. శనివారం జరిగిన మహిళల కబడ్డీ విభాగంలో భారత జట్టు స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.

PC: X.com
PC: X.com

దీంతో ప్రస్తుత ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్‌ ఖాతాలో మూడో బంగారు పతకం వచ్చి చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు, బలమైన ప్రత్యర్థి ఇరాన్‌తో జరిగిన ఫైనల్ పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆది నుంచీ నువ్వా నేనా అన్నట్లు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ తుది సమరంలో భారత క్రీడాకారిణులు అద్భుత సమన్వయం, వ్యూహాత్మక రైడింగ్‌తో ఆకట్టుకున్నారు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు 37-33 పాయింట్ల తేడాతో ఇరాన్‌ను మట్టికరిపించి భారత అమ్మాయిలు విజయకేతనం ఎగురవేశారు.

మరోవైపు, భారత్‌కు ఇతర విభాగాల్లోనూ పతకాలు లభించాయి. రైఫిల్ షూటింగ్‌లో భారత షూటర్లు రజత పతకాన్ని సాధించగా, స్క్వాష్ విభాగంలో భారత జోడీ సెమీఫైనల్స్‌లో తడబడి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. కబడ్డీలో స్వర్ణం సాధించడంపై దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

50 మీటర్ల రైఫిల్ టీమ్ ఈవెంట్ (50m rifle 3 positions team event)లో తిలోత్తమా సేన్, విదర్సా వినోద్, ఆషి చౌక్సే రజతాన్ని సొంతం చేసుకున్నారు. ఈ పోటీల్లో చైనా బృందం 1773 పాయింట్లతో పసిడి పతకాన్ని దక్కించుకోగా.. భారత బృందానికి 1763 పాయింట్లు రావడంతో రెండో స్థానంలో నిలిచింది. 1754 పాయింట్లు సాధించిన కజకిస్థాన్‌కు కాంస్యం దక్కింది. ఇక, స్క్వాష్ విభాగంలో మిక్స్‌డ్ డబుల్స్ జోడీ జోష్న చిన్నప్ప-సెంథిల్ కుమార్‌కు కాంస్య పతకం దక్కింది. సెమీస్‌లో హాంకాంగ్ ద్వయం లీ కా యి, తాంగ్ మింగ్ హాంగ్ చేతిలో ఓడింది. అంతకుముందు, భారత అథ్లెట్, హవల్దార్ సావన్ బర్వాల్ (Sawan Barwal) మారథాన్‌లో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో రజతంతో మెరిసి 44 ఏళ్ల తర్వాత మన దేశానికి పతకం అందించాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports